Bollywood: హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పై రాధిక ఆప్టే సంచలన కామెంట్స్

రాధిక ఆప్టే.. ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నందమూరి నటసింహాం బాలయ్య నటించిన లెెజెండ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాధిక ఆప్టే.. మరాఠి, బెంగాలీ, తమిళ భాషా చిత్రాల్లో కూడా నటిస్తుంది. ఇటీవల కాలంలో పలు ఇంగ్లీష్ సినిమాల్లో కూడా ఈ బోల్డ్ బ్యూటీ కనిపించింది. ఈ మధ్య కాలంలో సౌత్ లో తన స్పీడ్ ను తగ్గించి, బాలీవుడ్ లో తన జోష్ ని పెంచింది. పెళ్లై ఎనిమిదేళ్లు గడుస్తున్నా.. వరుసగా సినిమాలు చేస్తుంది.

సినిమాలతో పాటు అప్పడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తుంది. తాజాగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పై ఈ హాట్ బ్యూటీ సంచలన కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో సమానత్వం ఉండాలని, హీరోయిన్లకు, ఇతర మహిళలకు రెమ్యునరేషన్, మర్యాద తో ఇతర అంశాల్లో కూడా ప్రాధాన్యత ఉండాలని అన్నారు. స
సినీ రంగంలో రాణించడానికి మహిళలు చాలా కష్టపడుతున్నారని, అలాంటి వారికి సాయంగా ఉండాలని చెప్పుకొచ్చింది.

ప్రస్తుత కాలంలో సినిమా రంగంలో హీరోయిన్లకు, హీరోలకు పెద్ద తేడా లేదని తెలిపింది. హీరోయిన్లు కూడా హీరోలతో పనిలేకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హిట్స్ కొడుతున్నారని గుర్తు చేసింది. ఇలాంటి సమయంలో హీరోలకు, హీరోయిన్ల మధ్య డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నారంటూ ప్రశ్నించింది. సినీ రంగం కాకుండా, ఇతర రంగాల్లో కూడా ఈ డిఫరెన్స్ కనిపించడం లేదని చెప్పుకొచ్చింది. కాగా, సినిమా ఇండస్ట్రీలో హీరోలకు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఉంటే, హీరోయిన్లకు గరిష్టంగా 10 నుంచి 20 కోట్ల వరకే ఉంటున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

అలాగే వారి పాత్రలకు పెద్దగా స్కోప్ కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో రాధికా ఆఫ్టే చేసిన కామెంట్స్ ప్రస్తుతం బీ టౌన్ వీధుల్లో చర్చనీయాశంగా మారాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు