Srivishnu:’అల్లూరి’ కోసం బన్నీ

వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాన్ని ఎంచుకుంటూ తెలుగు సినీ రంగంలో హీరోగా వైవిద్యతను చాటుకుంటున్నాడు శ్రీ విష్ణు. జయపజయాలతో సంబంధం లేకుండా, కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్న ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేయడంలో శ్రీ విష్ణు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు.

ఇటీవలే ఈయన నటించిన ‘భళా తందనాన’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం శ్రీ విష్ణు ‘అల్లూరి’ అనే యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇది వరకే ఈ మూవీ నుండి విడుదలైన టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.

మొదటిసారిగా పోలీస్ అధికారి పాత్రలో శ్రీ విష్ణు నటిస్తున్న ఈ మూవీని యావత్ యూనిట్ మొత్తం ఎంతో కష్టపడి తెరకెక్కించిందని, అలానే మూవీ సక్సెస్ పై తమ అందరికీ గట్టి నమ్మకం ఉందని అంటోంది యూనిట్. ఇక సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 18న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించనుండగా, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు