Sreeleela : రెమ్యున‌రేష‌న్ కాకుండా..

ఆమె భార‌తీయ సంత‌తికి చెందిన అమెరిక‌న్ న‌టి.   తెలుగు, క‌న్న‌డ‌, చిత్రాల్లో న‌టించింది. 2019లో క‌న్న‌డంలో కిస్ చిత్రంతో అరంగేట్రం చేసింది. తెలుగులో పెళ్లి సంద‌D సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది శ్రీ‌లీల‌. ఈమె క‌న్న‌డలో ప‌లు సినిమాలు చేసింది. తెలుగులో మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌. త‌న అందంతో కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది.

ప్ర‌స్తుతం తెలుగులో మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంది. ధ‌మాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వ‌స్తున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం త‌రువాత వైష్ణ‌వ్ తేజ్ తో మ‌రో సినిమా చేస్తుంది. ఇదిలా ఉండ‌గా.. ఈమెకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. వ‌ర‌స సినిమాల‌తో శ్రీ‌లీల బిజీగా ఉండ‌డమే కాదు.. రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేసిన‌ట్టు స‌మాచారం. అయితే ఈమె హోట‌ల్ బిల్లు ఫిలిం స‌ర్కిల్స్‌లో ఓ హాట్ టాపిక్‌గా మారింది.

శ్రీ‌లీల హోట‌ల్ ఖ‌ర్చు రోజుకు రూ.20వేలు అని తెలుస్తోంది. హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్ లో బ‌స చేసేందుకు నిర్మాత‌లు రూ.20వేలు చెల్లిస్తున్నార‌ట‌. వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న సినిమాలో శ్రీ‌లీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం నెల రోజుల పాటు హైద‌రాబాద్‌లో త‌న త‌ల్లితో క‌లిసి బ‌స చేయ‌నుంద‌ట‌. ఆమె ఉండే హోట‌ల్‌బిల్లు రోజుకు రూ.20వేలు. నెల రోజుల‌కు దాదాపు రూ.6ల‌క్ష‌లు. ఇందులో వాస్త‌వం ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈమె హోట‌ల్ బిల్లుకు సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు