కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగేందుకు విష్ణు విశాల్ తనవంతుగా ప్రయత్నిస్తున్నాడు. తమిళ ఇండస్ట్రీలో ఆయన అడుగుపెట్టి దాదాపు 12 సంవత్సరాలు కావస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. తమిళంలో తాజా చిత్రం గట్ట కుస్తీ. తెలుగులో మట్టి కుస్తీ పేరుతో విడుదల కాబోతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించారు. కుస్తీ పోటీలో భాగంగా బరిలోకి దిగుతూ ఈ పోస్టర్ లో విష్ణు విశాల్ కనిపిస్తున్నాడు. విష్ణు విశాల్ తో రవితేజకి మధ్య సాన్నిహిత్యం ఉంది. ఈ చిత్రానికి విష్ణు విశాల్ తో పాటు రవితేజ కూడా నిర్మాత కావడంతో మరో విశేషం. అందుకే రవితేజ ఫస్ట్ లుక్ వదిలాడు. విష్ణు విశాల్ ఆసక్తికరంగా కనిపించాడు. ముఖ్యంగా కుస్తీ కోసం రంగంలో దిగుతున్న యోధుడిలా సాలిడ్ లుక్ లో కనిపిస్తున్నారు.
Read More: Hrithik roshan : క్రిష్4 కి లైన్ క్లియర్
ఈ సినిమా విష్ణు విశాల్ కి జోడీగా ఐశ్వర్య లక్ష్మీ కనిపించనున్నది. తమిళంలో ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు పుల్ బిజీగా గడుపుతున్న ఆర్టిస్ట్. ఇటీవల ఓటీటీలో వచ్చిన అమ్ము సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్‌కి మరింత చేరువ అయింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి చెల్ల అయ్యవు దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
Read More: Rana Daggubati : ఆలోచన మారిందా?
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...