కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పునీత్ కు ఈ అవార్డును ప్రదానం చేసింది. కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో భాగంగా పునీత్ కు ఈ అవార్డును ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పునీత్ పై ఎన్టీఆర్, రజినీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సభలో ఎన్టీఆర్.. తాను ఈ రోజు కర్ణాటకకు తన స్నేహితుడు అప్పూ కోసం వచ్చానని అన్నారు. ‘అప్పూ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన చేసిన మంచి పనులు, సేవల గురించి మాటల్లో చెప్పలేం. అప్పూను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇక్కడికి కేవలం అప్పూ కోసమే వచ్చాను. అప్పూ కు ‘కర్ణాటక రత్న’ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
Read More: Happy Birthday NTR: తనని తానే ఆవిష్కరించిన శిల్పి..!
అలాగే రజినీ కాంత్ కూడా పునీత్ పై ప్రశంసలు కురిపించారు. ఓ నటుడు 60 ఏళ్లల్లో సాధించే కీర్తిని అప్పూ కేవలం 21 ఏళ్లలోనే సాధించాడని కొనియాడారు. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్ ఉన్నట్టు కన్నడలో అప్పూ ఉన్నాడని ఆయన చెప్పారు.
Read More: Megastar Chiranjeevi: ఆసక్తికర వ్యాఖ్యలు
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...
నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ...