టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు ఈ మధ్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలో కాస్త తడబడ్డ, ఆ తర్వాత తనను తాను మార్చుకుని, స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్ లను అందుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళీ భాషల్లో విడుదలై మంచి లాభాలను తెచ్చింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
ఇక ఇదిలా ఉంటే.. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ క్రైమ్ త్రిల్లర్ హిట్ 2. శైలేష్ కోలను దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా, సీక్వెల్ లో అడివి శేష్ నటిస్తున్నారు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా, హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
Read More: Kantara : సక్సెస్ టూర్
ఇక ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై ఆసక్తి నెలకొంది. మొదటి పార్ట్ కంటే కూడా ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ హీరోయిన్ పాత్రను రివిల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఆర్య పాత్రలో నటిస్తుంది. అదేవిధంగా విలక్షణ నటుడు రావు రమేష్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ నాగేశ్వరరావు పాత్రలో కోమలీ ప్రసాద్ వర్షగా నటిస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 2, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి గారి బిహెచ్ ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా, జాన్ స్టీవర్ట్ ఏడూరి సంగీతం అందిస్తున్నారు.
Read More: Anil Ravipudi “ఆ సినిమాలు చేయాలేను”
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...