Dasara: రంగస్థలాన్ని మించిందన్నారు.. దాన్నే దింపారు

మార్చి 30 న విడుదలైన దసరా సినిమాకు హిట్ టాక్ వస్తుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. నాని రఫ్ అండ్ టఫ్ లుక్ లో గడ్డంతో తెలంగాణా యాసలో డైలాగ్స్ చెప్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. పాన్ ఇండియా సినిమా గా వచ్చిన ఈ సినిమా తెలుగులో నాని కెరియర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని తెచ్చుకుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 38 కోట్ల గ్రాస్ ని దక్కించుకుంది. అంతే కాదు టైర్ 2 హీరోల్లో తను కోల్పోయిన నంబర్ వన్ స్థానాన్ని మళ్ళీ దక్కించుకున్నాడు. అయితే రెండవ రోజు నైట్ షో లకు మాత్రం “IPL” ఎఫెక్ట్ పడింది.

అయితే మొదటి రోజు బెనిఫిట్ షో లలో వచ్చిన రెస్పాన్స్ లో కొంతమంది ఈ సినిమా రంగస్థలాన్ని మించి ఉందని అన్నారు. అయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రంగస్థలాన్నే చిన్నచిన్న మార్పులు చేసి తీసాడని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శ్రీకాంత్ ఓదెల సుకుమార్ శిష్యుడే అని చాలా మందికి తెలియదు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు. అయితే సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత అసలు రివ్యూ లు బయటికి వస్తున్నాయి. ఇక రంగస్థలానికి దీనికి  కొన్ని పోలికలు ఉన్నాయి.

- Advertisement -

రంగస్థలం సినిమా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి బ్యాక్డ్రాప్ లో “రంగస్థలం” పల్లెటూరిలో సాగుతుంది. ఇక దసరా సినిమా తెలంగాణా లోని గోదావరి ఖని బ్యాక్డ్రాప్ లో వీర్లపల్లి లో సాగుతుంది. ఈ రెండింట్లో ను ఎక్కువగా గొడవలొచ్చేది కులాల సమస్య పైనే. రెండు సినిమాల్లోనూ ప్రెసిడెంట్లు చేసే ఆకృత్యాలపైనే సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో ప్రెసిడెంటు మనిషిని కొట్టే సీన్ ని చాలా వరకు అలాగే దింపేసాడు.

ఇక పాత్రల మధ్య పోలికల్నిఒక్కసారి గమనిస్తే, రామ్ చరణ్ – నాని, సమంత – కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి – ఆదిపినిశెట్టి, జగపతి బాబు – షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ – సాయి కుమార్, జబర్దస్త్ మహేష్- రవితేజ నన్నిమల అంతే కాదు, రంగస్థలం లో అజయ్ ఘోష్, ఇంకా పోలీస్ ఆఫిసర్స్ పాత్రలు కూడా దసరా సినిమాలో సెమిలర్ గా కనిపిస్తాయి. ఏది ఏమైనా రంగస్థలాన్ని మించి ఉంది అన్న ఆ మాట నిజం కాదు. యాక్టింగ్ విషయంలో మాత్రం నటీనటులు వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు. విశేషం ఏంటంటే రంగస్థలం విడుదలైన మార్చి 30 రోజునే దసరా సినిమా విడుదలైంది. ఇప్పటికే 50 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా 100 కోట్ల దిశగా ప్రయాణిస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు