Shaakuntalam: సెకండ్ సింగిల్ అవుట్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రయాణ గాత ఆధారంగా మైథాలజికల్ లవ్ స్టోరీ గా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. దుర్వాస మహామునిగా మోహన్ బాబు కనిపించారు. గౌతమి సుబ్బరాజుతో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలను పోషించారు.

ఫిబ్రవరి 17న దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో శాకుంతలం సినిమా రిలీజ్ కానుంది. 3డిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ ఇప్పటికే శాకుంతలం మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సమంత స్క్రీన్ ప్రజెంట్, గుణశేఖర్ టేకింగ్ శాకుంతలం ట్రైలర్ ని వర్త్ వాచింగ్ గా మార్చింది. ఇక ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఋషివనంలోన అంటూ సాగే రెండో సాంగ్ ను లాంచ్ చేశారు. తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వెర్షన్ సాంగ్ ను కూడా విడుదల చేశారు.

తెలుగు వెర్షన్ ను సిద్ శ్రీరామ్, చిన్మయి పాడారు. శ్రీమణి ఈ పాట రాసారు. శాకుంతలం నుంచి ఇప్పటికే విడుదలైన మల్లికా మల్లికా పాట అందరిని ఆకట్టుకుంటుంది. శ్రీమణి అందించిన చక్కటి సాహిత్యానికి మణిశర్మ అదిరిపోయే కంపోజిషన్ తోడవడంతో ఈ పాట వినసొంపుగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయిలు కలిసి పాడిన అధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు