Dasara: టీజర్ ముహూర్తం ఫిక్స్

పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ దసరా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అనౌన్స్మెంట్ ఇవాళ ఉండబోతుందని చిత్ర యూనిట్ నిన్న తెలిపింది. అన్నట్లుగానే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.

దసరా మూవీ టీజర్ ను జనవరి 30న రిలీజ్ చేస్తున్నట్లు ఓ వీడియో రూపంలో చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక ఈ టీజర్ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే విధంగా ఉండబోతుందని ఈ చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో నాని పూర్తి తెలంగాణ యాసలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

- Advertisement -

కాగా, ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే జనవరి 30 వరకు వెయిట్ చేయాల్సిందే.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు