Sarkaru vaari Paata : పుష్ప లానే సర్కారు వారి పాట..!

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫిల్మ్ మేకర్స్ లేదా హీరోలు తమ గత సినిమాలను లేదా సూపర్ హిట్ సినిమాలతో పోల్చుకుని హైప్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తీరా విడుదల రోజున సినిమా అలా లేకపోతే ఆడియెన్స్ నిరాశ చెంది నెగిటివ్ టాక్ చెబుతున్నారు. ఇటీవల కాలంలో మనం పుష్ప, సర్కారు వారి పాట సినిమాల విషయంలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది.

పుష్ప సినిమా 10 కే.జి.ఎఫ్ లతో సమానం అంటూ దర్శకుడు బుచ్చిబాబు ఓ సందర్భంలో చెప్పాడు. కట్ చేస్తే సినిమాలో ఆ రేంజ్ ఎలివేషన్స్ లేవు. కే.జి.ఎఫ్ థీమ్ ను రంగస్థలం స్టైల్ లో చెప్పినట్టు ఉంది. కే.జి.ఎఫ్ లో లా బలమైన ఎమోషన్స్ పుష్ప లో లేవు. అలాగే పార్ట్ 2 పై అంచనాలు పెంచే విధంగా అస్సలు ఉండదు. కానీ అల్లు అర్జున్ నటన సినిమాని నిలబెట్టింది. ఆ సినిమా అంతలా కలెక్ట్ చేసింది అంటే ముఖ్య కారణం అదే.

ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకి వద్దాం. ఈ సినిమాని మొదటి నుండీ పోకిరి తో పోలుస్తూ వచ్చారు హీరో అండ్ సర్కారు వారి టీమ్. కానీ విడుదల రోజున చూస్తే మూవీ అలా లేదు. ఈ మూవీకి కూడా ప్లస్ పాయింట్ హీరో మహేష్ బాబే. దర్శకుడు పరశురామ్ మహేష్ పాత్రని తీర్చిదిద్దిన తీరు బాగుంది. ఒకవేళ ఈ సినిమా నిలబడితే అది మహేష్ పాత్ర వల్లనే అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు