టాలీవుడ్ లో సినిమాల సమరం స్టార్ట్ కాబోతుంది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చిన సినిమాలన్నీ జులై నెలలో రిలీజ్ కానున్నాయి. రానా, సాయి పల్లవి నటించిన ’విరాట పర్వం’, ఎనర్జిటిక్ హీరో రామ్ ’ది వారియర్’, అక్కినేని నాగ చైతన్య ’థాంక్యూ’, వైష్ణవ్ తేజ్ ’రంగ రంగ వైభవంగా’ తో పాటు ’పక్కా కమర్షియల్’, ’వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాలు జులైలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
తాజా గా ఈ లిస్ట్ లోకి మరో యంగ్ హీరో మూవీ చేరిపోయింది. నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ’కార్తికేయ-2’ మూవీని జులై 22న రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసిన హీరో నిఖిల్, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటో పోస్టు చేసి జులై 22న థియేటర్స్ లో కలుసుకుందామంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
కాగ నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. 2014లో వచ్చిన కార్తికేయకు ఈ మూవీ సిక్వెల్ గా తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాలర్ అర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రెండేళ్ల క్రితమే.. షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయినా, ఈ మూవీ నుండి ఎప్పటికప్పుడు వస్తున్న అప్ డేట్స్ తో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ అంచనాలను ఈ మూవీ అందుకుంటుందా, లేదా..? అని తెలియాలంటే జులై 22 వరకు వెయిట్ చేయాల్సిందే.