పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
టాలీవుడ్ లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఇంతా అంత కాదు. ఆయన సినిమాలు హిట్ అయినా, ప్లాప్ అయినా, లక్షల్లో ఫ్యాన్స్, వేలల్లో సైనికులు ఆయన సొంతం. తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఓ దేవుడు. యంగ్ హీరోలకు ఆయనే ఆదర్శం. పవన్ సినిమాలకు రెండేళ్లు గ్యాప్ ఇచ్చినా, ఆయనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
పవన్ కళ్యాణ్ మూవీకి డిజాస్టార్ టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం బాగానే వస్తాయి. ఇప్పటి వరకు పవర్ స్టార్ టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ముందు వరుసలోనే ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓ వెలితి అలాగే ఉంది. ఆయన ఇంత వరకు 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టలేదు. ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ మూవీ భారీ అంచనాలతో రిలీజైనా, ఆ ముచ్చట తీర్చకుండానే థియేటర్స్ నుంచి వెళ్లి పోయింది. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం నిబంధనలు కూడా మైనస్ గా మారాయి.
Read More: Gopichandh :డింపుల్ హయతి రిలాక్స్ మోడ్ ఆన్
యష్ లాంటి డబ్బింగ్ హీరో తెలుగులో 100 కోట్లు కలెక్షన్లు చేస్తున్నా, టాలీవుడ్ టాప్ హీరోకు ఏం అయిందని సినీ లవర్స్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జీరో ఫాలోయింగ్ ఉన్న యష్, కేజీఎఫ్ – 2 సినిమా తొలి వారంలోనే 105 కోట్లు వసూళ్లు చేసింది.
అలాగే టాలీవుడ్ లో టైర్ 1 హీరోలుగా ఉన్న చిరంజీవి, రామ్ చరణ్, తారక్, ప్రభాస్, మహేష్ బాబు ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 100 కోట్ల షేర్ ను అందుకోలేదు.
Read More: Bholashankar: త్వరలోనే మెగా మ్యూజిక్ మేనియా స్టార్ట్
దీంతో పవర్ ఫ్యాన్స్, పవనేశ్వరా.. పవరీశ్వరా.. ఏంటయ్యా ఇది..? ఈ ముచ్చటను ఎప్పుడు తీరుస్తావయ్య అంటున్నారు. కాగ పవన్ కళ్యాణ్ ’హరి హర వీర మల్లు’ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో అయినా.. ఈ 100 కోట్ల మార్క్ ను టచ్ చేస్తారేమో చూడాాలి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...