Saamajavaragamana: శ్రీ విష్ణు కొత్త మూవీ టీజర్.. బాలు గాడి వింత ప్రాబ్లం

టాలెంటెడ్ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెంటల్ మదిలో, నీది నాది ఓకే కథ, రాజ రాజ చోర వంటి విభిన్నమైన చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.శ్రీ విష్ణు హీరో గా నటించిన కొత్త మూవీ “సామజవరగమన”. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ లో అనిల్ సుంకర, రాజేష్ దండ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ అబ్బరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమా లో రెబా మోనికా జాన్ అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా లో నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

తాజాగా “సామజవరగమన” మూవీ టీజర్ ఏప్రిల్ 27 న రిలీజ్ అయింది.

- Advertisement -

 

“సామజవరగమన” టీజర్ మొత్తం ఎంటర్టైనింగ్ గా ఫన్ గా ఉంది. టీజర్ లో గమనించిన విషయాలేంటంటే, ఈ సినిమా లో హీరో పేరు బాలు. ఈ సినిమా లో హీరోకు ఒక ప్రాబ్లం ఉంటుంది. హీరో తనకి ఎవరు ఐ లవ్ యు అని చెప్పినా వాళ్ళ చేత బలవంతంగా రాఖీ కట్టించుకుంటాడు. సినిమా మొత్తం ఈ పాయింట్ చుట్టూనే సాగుతుందని టీజర్ లో తెలిసిపోయింది. ఇక టీజర్ చివర్లో హీరో ఫోన్లో బాలకృష్ణ స్టైల్ లో డైలాగ్ చెప్పడం హైలెట్ అని చెప్పొచ్చు.

టీజర్ ని టాగ్ చేస్తూ శ్రీ విష్ణు ఇదేనంది మా బాలు గాడి వింత ప్రాబ్లం అని కామెంట్ పెట్టాడు. ఇక “సామజవరగమన” సినిమాను సమ్మర్ కానుక గా మే 18 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు