Dimple hayathi : ఆ సినిమా ఆఫర్ కోసం డైరెక్టర్ రెండుసార్లు అలా చేశాడు

డింపుల్ హయాతి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో నర్తించి కుర్రకారును ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ. ఆ పాటలో తన అందచందాలతో పాటు, అదిరిపోయే డాన్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి మూవీ లో మెరిసింది. దీంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

ఇక తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన రామబాణం సినిమాలో హీరోయిన్ గా నటించింది డింపుల్ హయాతి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 5వ తేదీన విడుదల కానుంది. ఈ ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్ హయాతి పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ చిత్రంలో తన పాత్ర యూట్యూబ్ కి సంబంధించి ఉంటుందని.. అయితే గ్లామరస్ పాత్రలు చేసే తాను ఆ పాత్రకు సెట్ అవుతానో లేదో తెలియదని.. ఆ భయంతోనే డైరెక్టర్ ఏకంగా రెండుసార్లు తనని స్పెషల్ గా ఆడిషన్ చేసి మరి ఈ పాత్రకి ఎంచుకున్నారని చెప్పుకొచ్చింది.

అలా రెండుసార్లు ఆడిషన్స్ ఇచ్చిన తర్వాతే ఈ సినిమాలో భైరవి పాత్రకు తాను సరిపోతానని శ్రీవాస్ గారికి నమ్మకం వచ్చిందని తెలిపింది డింపుల్. నిజానికి ఇలాంటి విషయాలను ఏ హీరోయిన్ అయినా బయటపెట్టరు. కానీ డింపుల్ హయాతి మాత్రం అలాంటి భయాలు పెట్టుకోకుండా ఓపెన్ గా చెప్పేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు