Sai Dharam Tej: నిహారికకు కొత్త లైఫ్ ఇవ్వబోతున్న మెగా హీరో?

మెగా డాటర్ నిహారిక కొనిదెల గురించి తెలియని వారండరు. అయితే ఈ బ్యూటీ విడాకులు తీసుకోబోతున్నట్టు కొంతకాలంగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం నిహారిక భర్త తన సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫోటోలను, వారు కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేయడమే. అంతేకాకుండా సోషల్ మీడియాలో చైతన్య నిహారికను అన్ ఫాలో చేశారు కూడా. కాగా, ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. నిహారిక కూడా తన సోషల్ మీడియాలో భర్తను అన్ ఫాలో చేసింది.

అంతేకాకుండా పెళ్లి ఫోటోలను మరియు భర్త ఫోటోలను డిలీట్ చేసింది. ఇది ఇలా ఉండగా, నిహారిక…తాజాగా క్రేజీ సిరీస్ తో ప్రేక్షకుల ముందు రాబోతుంది. నిహారిక ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. అలెక్సా డేవిస్, విల్ మెరిక్, సార్గోన్ యెల్డ నటించిన హాలీవుడ్ హిట్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’ 2019లో విడుదలైంది. ఈ సిరీస్ ని తెలుగులో రీమేక్ చేశారు. ప్రస్తుతం ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మే 16న అంటే ఇవాలే హైదరాబాదులోని దస్పల్లా హోటల్ లో ‘డెడ్ పిక్సెల్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాటు చేస్తున్నారు.

ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హాజరు కాబోతున్నారు. నటిగా వెబ్ సిరీస్ తో మళ్ళీ అలరించబోతున్న నిహారికకు, టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పబోతున్నారు. కాగా, దీనికి అక్షయ్ పుల్ల స్క్రీన్ ప్లే అందించగా… డైరెక్టర్ ఆదిత్య మండల ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు