Tollywood Actrees: శ్రియ శరన్ మళ్లీ ప్రెగ్నెంటా ? బేబీ బంప్ ఫోటోలు వైరల్

2001లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరన్.. కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన అందం అభినయంతో శ్రియ తెలుగులో వరుసగా సినిమా అవకాశాలను కొట్టేసింది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్ధాలు అవుతున్నా.. ఇంకా హీరోయిన్ పాత్రలు చేస్తుంది అంటే శ్రియకు ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇటీవల ఉపేంద్ర నటించిన కబ్జా సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే అజయ్ దేవగణ్ తో దృశ్యం2లో కూడా కనిపించింది.

దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఓ కీలక పాత్ర చేసింది. ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్ అనే చిత్రంలో శ్రియ శరన్ నటిస్తుంది. ఈ అందాల తార ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలను ఆరబోస్తూ.. అభిమానులకు పిచ్చెక్కేలా చేస్తుంది. కాగా, శ్రియ.. రష్యా కు చెందిన ఆండ్రీ కోస్చీవ్ తో చాలా రోజులు పాటు డేటింగ్ లో ఉంది. 2018లో వీరు పెళ్లితో ఒక్కటైయ్యారు. పెళ్లి తర్వాత రెండేళ్లకు శ్రియ గర్భం దాల్చింది.

2021 జనవరిలో పండంటి ఆడపిల్లకు శ్రియ జన్మనిచ్చింది. అయితే శ్రియ గర్భం దాల్చడం, జన్మనివ్వడం అంతా రహస్యంగా ఉంచింది. ఒక సారి మీడియా సమావేశంలో తన ఇప్పుడు తల్లిని అంటూ తన కూతురిని పరిచయం చేసింది. అయితే ఇదంతా రహస్యంగా ఉంచడానికి పలు కారణాలు ఉన్నాయని శ్రియ చెప్పుకొచ్చింది. ప్రెగ్నెన్సీ, డెలవరీ సమయంలో తన శరీరంలో చాలా మార్పులు జరిగాయని, అది చూసి బాడీ షేమింగ్ చేస్తారేమో అనే ఉద్ధేశంతో బయటికి చెప్పలేకపోయినట్టు వివరించింది. శ్రియగర్భంతో ఉన్న సమయంలో లాక్ డౌన్ ఉండటం వల్ల షూటింగ్స్ ఏమీ లేవు. ఇది శ్రియకు కలిసొచ్చింది.

- Advertisement -

ఇదిలా ఉండగా, తాజాగా గర్భంతో ఉన్నప్పుడు బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను శ్రియ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రియ నిండు గర్భవతిగా కనిపిస్తుంది. అయితే ముందుగా ఈ ఫోటోలను చూసి కొంత మంది, శ్రియ మళ్లీ ప్రెగ్నెంట్ అయింది అనుకున్నారు. కానీ, ఈ ఫోటోలు ఇప్పటివి కాదని శ్రియ వెల్లడించింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు