Niharika: అనుకున్నది సాధించిన మెగా డాటర్..

మెగా డాటర్ నిహారిక గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాలవల్ల సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్ధల కారణంగా వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. 2020 డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డను నిహారిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకులు తీసుకోబోతున్నారా..? అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరు స్పందించలేదు. ఇప్పటికే చైతన్య.. నిహారికను అన్ ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలు అన్నింటిని డిలీట్ చేశాడు. నిహారిక కూడా తన ఇంస్టాగ్రామ్ లో చైతన్యను అన్ ఫాలో చేయడమే కాకుండా.. చైతన్య తో దిగిన ఫోటోలని కూడా డిలీట్ చేసింది. దీంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరినట్లు అయింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మళ్లీ వీరిద్దరిని కలిపినట్టు తెలుస్తుంది. నిహారికా సినిమాల్లో నటించదు అనే కండిషన్స్ తో ఈ జంట మళ్లీ ఒక్కటైందని సమాచారం.

ఇదిలా ఉంటే.. పెళ్లి కాకముందే నిహారిక ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఈమె తన నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా స్థిరపడింది. మధ్యలో మళ్లీ నటిగా చేయడానికి ముందుకు వచ్చినా, మళ్లీ ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తింది. నిహారిక సొంతంగా “పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్” బ్యానర్ ను స్థాపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ బ్యానర్ పై ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మించి నిర్మాతగా సక్సెస్ అయింది నిహారిక.

- Advertisement -

తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్ కు ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుంది. ఎప్పటినుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కంటున్న నిహారిక తాజాగా ఆ పని పూర్తి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు నిహారిక కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు