Sudheer babu : మాయా మశ్చీంద్ర కాదు..మామా మశ్చీంద్ర

సుధీర్ బాబు హీరోగా, హర్షవర్ధన్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం “మామా మశ్చీంద్ర” అయితే ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి అందరు ఈ టైటిల్ ని “మామా” అనే పదానికి బదులు “మాయ” అని అనుకుంటున్నరంట ఈ డౌట్ ని క్లారిఫై చేయాలనీ డైరెక్టర్ హర్ష వర్ధన్ ఫిక్స్ అయ్యారు. అందుకే అసలు..ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయం పై ఆయన క్లారిటీ ఇవ్వనున్నట్లు ఆయన సుధీర్ బాబు కలిసి టీజర్ ఎనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేసారు.
యాక్టర్ గా హర్ష వర్ధన్ గారు మన అందరికి సుపరిచితుడే , అయితే ఆయన యాక్టర్ గా మాత్రమే కాదు, మంచి రైటర్ కూడా మనం , గుండెజారి గల్లంతయిందే లాంటి సూపర్ హిట్ చిత్రాలకి ఆయన డైలాగ్ రైటర్ గా వర్క్ చేసారు. అలాగే ఆయనకి రైటింగ్ తో పాటు డైరెక్షన్ అంటే కూడా చాలా ఇష్టం.అయితే యాక్టింగ్ లో బిజీ గా ఉండటం వాళ్ళ ఇన్ని రోజులు డైరెక్షన్ చేయడానికి కుదరలేదు. ఇలాగే ఉంటె ఇంకా డైరెక్షన్ ఎప్పటికి చేయలేను అనే భయంతో ఆయన యాక్టింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకొని సుదీర్ బాబు హీరోగా “మామా మశ్చీంద్ర” అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూట్ ఇటీవలనే కంప్లీట్ అయింది

ఈ సినిమాలో సుదీర్ బాబు 3 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆ మూడు పాత్రల లుక్స్ ని రిలీజ్ చేసారు. పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడు సిక్స్ ప్యాక్ తో కనిపించే సుధీర్ బాబు మామా మశ్చీంద్ర మూవీలో బొద్దుగా కనిపించబోతున్నారు. అలాగే మిగితా రెండు పాత్రలలో ఒకటి ఓల్డ్ ఏజ్ గెటప్ లో ,మరోదాంట్లో యంగ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఏప్రిల్ 14న ఈ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నారు. అయితే టీజర్ చూసి ఎవరైతే ముందుగా మామా మశ్చీంద్ర అని టైటిల్ ఎందుకు పెట్టారో చెబితే వాళ్లలో పది మందికి పెద్ద పార్టీ ఇస్తా అని హర్ష వర్ధన్ టీజర్ ఎనౌన్స్మెంట్ వీడియో చెప్పుకోచ్చారు.

 

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు