Ram Charan: గేమ్ ఛేంజర్ జోనర్‌ను రివీల్ చేసిన ప్రొడ్యూసర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రం తర్వాత చేస్తున్న తాజా సినిమా గేమ్ ఛేంజర్. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో, ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నాడు. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. అయితే శంకర్.. రజనికాంత్ తో రోబో2.O వంటి హై బడ్జెట్, హై గ్రాఫిక్స్, హై వీఎఫ్ఎక్స్ వర్క్ తో చేసిన చిత్రం తర్వాత గేమ్ ఛేంజర్ ను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో, ఇది ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

అలాగే గేమ్ ఛేంజర్ ఎలాంటి జోనర్ లో రాబోతుంది.. కథ ఎలా ఉంటుంది అనే దానిపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా నిర్మాత దిల్ రాజు ఫస్ట్ టైం సినిమా గురించి పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నాడు. గేమ్ ఛేంజర్.. ఒక సామాజిక సమస్య నేపథ్యంలో సాగే రివేంజ్ డ్రామా అని వెల్లడించాడు. ఇప్పటి వరకు శంకర్ చేసిన సినిమాల్లాగే, కమర్షియల్ హంగులు ఉంటూ.. ఒక సోషల్ మెసేజ్ సినిమాలో ఉంటుందని ప్రకటించారు.

అలాగే రోబో, రోబో 2.O లాగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండదని తెలిపాడు. భారతీయుడు, జెంటిల్‌మన్ వంటి సినిమాల్లా గేమ్ ఛేంజర్ కనిపిస్తుందని వెల్లడించారు. ఈ సినిమాతో వింటేజ్ శంకర్ కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని, ఒక పాత్ర తండ్రి, మరో పాత్ర కొడుకు అని చాలా రోజుల నుంచి రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇది ఇలా ఉండగా, గేమ్ ఛేంజర్ ఇప్పటికే దాదాపు 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయింది. మిగితా పార్ట్ ను త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నహాకాలు చేస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు