టాలీవుడ్‌లో రవితేజ అంటే తెలియని వారు ఉండరు. కానీ జూనియర్ రవితేజ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జూనియర్ రవితేజ అంటే మరెవ్వరో కాదండోయ్.. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ని కెరీర్ ప్రారంభంలో జూనియర్ రవితేజ అని పిలిచారు. నిఖిల్ యాక్టింగ్ ఎక్కువ రవితేజను పోలి ఉండడంతో రవితేజను అనుసరిస్తున్నారనే వార్తలు వినిపించేవి. ఇక ఆ తరువాత నిఖిల్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు.
దీపావళికి నాలుగు సినిమాలు వచ్చి సందడి చేసినట్టుగానే.. ఈ సారి క్రిస్మస్‌కి ఒకేరోజు 2 సినిమాలు పోటీ పడనున్నాయి. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా 18 పేజేస్ అనే చిత్రం రూపుదిద్దుకుంటుంది. కుమారి 21 ఎఫ్ సినిమా దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ 2, సుకుమార్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ లేదు.
ఎట్టకేలకు డిసెంబర్ 23న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ-త్రినాథరావు నక్కిన కాంబోలో వస్తున్న ధమాకా సినిమా కూడా డిసెంబర్ 23న విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా ఒకేరోజు విడుదలవ్వడం విశేషం. రెండు సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 23 వరకు వేచి చూడాలి.