‘ఏక్ మినీ కథ’ సినిమాతో సంతోష్ శోభన్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత అతను చేసిన ‘మంచి రోజులులోచ్చాయి’ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. చాలా తక్కువ సమయంలో మారుతి తెరకెక్కించిన ఆ సినిమా ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఆ తర్వాత సినిమాగా సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ చేశాడు.
నిహారిక బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. మేర్లపాక గాంధీ నుంచి చివరిసారిగా వచ్చిన ‘మ్యాస్ట్రో’ మాత్రమే ఫ్లాప్ అయ్యింది. అంతకుముందు ఆయన నుంచి వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘లైక్, షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ సినిమా నుంచి ప్రభాస్ తో ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.
Read More: SSMB28: షూటింగ్ షురూ
సంతోష్ శోభన్ ట్రావెల్ బ్లాగర్ గా తన యూట్యూబ్ ఛానల్ కోసం కొత్త వీడియోని షూట్ చేయడానికి వెళ్లిన ట్రిప్ లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లాని కలవడం, ప్రేమలో పడటం చాలా క్రేజీగా ప్రజెంట్ చేశారు. కథాంశం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ సినిమా నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు సినిమా అంచనాలను పెంచాయి. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడారు. “మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నవంబర్ 04న విడుదలయ్యే ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ సినిమాను అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.
Read More: Boss Party : అదిరిపోయనది పార్టీ..
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...