Ramabanam: అదిరిపోయిన రెండో సాంగ్.. ఈ మూవీతో తెలుగమ్మాయి హిట్ కొట్టేనా ?

మాస్ హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రామబాణం. ఈ మూవీ ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కిస్తున్నాడు. గోపీచంద్, శ్రీవాస్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం, లౌక్యం ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం గా “రామబాణం” వస్తుంది.

ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 5 న విడుదలకు సిద్ధం అవుతుంది. రామబాణం చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సీనిమా టీజర్ సినిమాపై ఉన్న అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు.

ఇక ఈ మూవీలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ఈ హీరోయిన్ హెదరాబాద్ లో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. గద్దల కొండ గణేష్ లో ఐటెం సాంగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన ఫస్ట్ సినిమా ఖిలాడీ. ఆ మూవీ డిజాస్టర్ అయింది. ఇప్పుడు రామబాణం మూవీ లో హీరోయిన్ గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ సినిమా ద్వారా డింపుల్ కి మంచి హిట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హీరో డైరెక్టర్ల సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడం, ఇంకా ఈ సినిమాకి నందమూరి బాలకృష్ణ టైటిల్ నిర్ణయించడం అన్నిటికంటే ముఖ్యంగా ఈ మూవీ టీజర్, పాటలు కూడా సినిమా పై అంచనాల్ని పెంచేయడం వల్ల సినిమా హిట్ కొట్టేలానే ఉంది. మరి రామబాణం సినిమా ద్వారా డింపుల్ హయతి తెలుగులో హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అవుతోందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు