Akhil: ‘ఏజెంట్’ కష్టాలు ఇంకా తీరలేదా..?

అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డిల కాంబినేషన్లో ఏజెంట్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. మొదట్లో సినిమాకు బాగానే బజ్ క్రియేట్ అయినప్పటికీ ఎందుకో తెలీదు గానీ ఆశించిన స్టేయిలో బిజినెస్ జరగలేదని వార్తలొస్తున్నాయి. ఇంకా షూట్ పెండింగ్ ఉందని, ఈ సారి కూడా విడుదల వాయిదా పడే ఛాన్స్ ఉందని మొన్నటిదాకా వార్తలొచ్చాయి. అయితే సినిమా యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టడంతో వాటిల్లో నిజం లేదని తేలింది.

ఈ నెల 28న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబందించిన నైజాం ఏరియా రైట్స్ కొనటానికి బయ్యర్లు ముందుకు రావట్లేదంటూ వార్తలొస్తున్నాయి. డిస్ట్రబ్యూషన్ రంగంలో ఉన్న రాజకీయాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆంధ్రా సీడెడ్ ఏరియాల్లో డీసెంట్ రేట్ కు అమ్ముడుపోయిన ఈ సినిమాను నైజాం ఏరియాలో కొనటానికి దిల్ రాజు సైతం ఆసక్తి చూపలేదట. సురేందర్ రెడ్డి లాంటి కమర్షియాల్ డైరెక్టర్ నుండి వస్తున్న సినిమాకు నైజాం లాంటి ఏరియాలో బయ్యర్స్ దొరకకపోవడం శోచనీయం. విడుదల దగ్గరపడుతున్నా కూడా సినిమా ప్రమోషన్స్ పెద్దగా కనపడకపోవడం చూస్తుంటే ఈ సినిమాపై వినిపిస్తున్న వార్తలు నిజమే అన్న నమ్మకం కలుగుతోంది.

ఈ సినిమాకు సంబంధించి టీజర్ మినహా విడుదలైన పాటలు ఒక్కటి కూడా మినిమమ్ బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. ఆశించిన బిజినెస్ లేకపోవటానికి ఇది కూడా ఒక కారణమనే చెప్పాలి. అఖిల్ కు హిట్ ఎంతో కీలకమైన దశలో వస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో, ఫిట్నెస్ మరియు లుక్స్ విషయంలో అఖిల్ పడ్డ కష్టానికి తగ్గ ఫలితం అందుతుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు