Mega Powerstar: చరణ్ కి స్పీడ్ బ్రేకర్ గా మారిన డైరెక్టర్..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొంది హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే దిశగా సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. RRR సినిమా కోసం చాలా కలం కేటాయించిన చెర్రీ, ఆ సినిమా అయిపోయాక వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టారు. ప్రస్తుతం చరణ్ శంకర్ ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, ఈ సెప్టెంబర్ కి షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

ఇదిలా ఉండగా ప్రస్తుతం గేమ్ చేంజర్ షెడ్యూల్ కి గ్యాప్ ఇచ్చిన దర్శకుడు శంకర్ ఇండియన్2 సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదే  ఇప్పుడు చెర్రీకి అడ్డంకిగా మారిందని టాక్ వినిపిస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గేమ్ చేంజర్ షూట్ పూర్తి చేసుకొని బుచ్చిబాబు సినిమా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న చరణ్ కి ఇండియన్2 రూపంలో దర్శకుడు శంకర్ స్పీడ్ బ్రేకర్ అయ్యారని అంటున్నారు.

ఇప్పటికే రకరకాల కారణాలతో పలుమార్లు వాయిదా పడ్డ ఇండియన్2 సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో, ఎన్నో అంచనాలు పెట్టుకున్న తమ హీరో సినిమా ఎప్పుడు థియేటర్లో చూస్తామో అని రామ్ చరణ్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్ హై రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిన సినిమా త్వరగా విడుదలై అలరించాలని ఆశిద్దాం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు