Tollywood: మన హీరోల ఇమేజ్ మార్చేసిన సినిమాలివే..!

‘ఇమేజ్’, సినీరంగంలో తరచూ వినిపించే పదం. సాధారణంగా సినిమాల్లో హీరోలు చేసే క్యారెక్టర్లను బట్టి ఇమేజ్ ని డిసైడ్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఒక్క సినిమాతో క్లాస్ ఇమేజ్ ఉన్న హీరోలు మాస్ ఇమేజ్ కి మారటం, మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు క్లాస్ హీరోలుగా మారటం జరుగుతూ ఉంటుంది. ఈ క్యాటగిరిలో మొదటి స్థానంలో నిలిచే సినిమా శివ. అప్పటి వరకు క్లాస్ ఇమేజ్ ఉన్న నాగార్జునకి మాస్ ఇమేజ్ ని తేవటమే కాకుండా ఇండస్ట్రీ ఆలోచన తీరునే మార్చేసింది. అప్పట్లో కెమెరా వర్క్ విషయంలో గానీ, ఫైట్స్ విషయంలో గానీ, మ్యూజిక్ విషయంలో గానీ, ఒక్కటేమిటి చాలా అంశాల్లో కొత్త ట్రెండ్ పరిచయం చేసింది ఈ సినిమా. టాలీవుడ్ గురించి చెప్పాల్సి వస్తే శివ సినిమాకి ముందు, శివ తర్వాత అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆ తర్వాత శివ సినిమా రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక్కడు. ఈ సినిమాతో మహేష్ బాబు రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అటు గుణశేఖర్, ఇటు మహేష్ బాబుల కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పచ్చు. ఇటీవల రీరిలీజ్ చేస్తే ఇప్పటి యూత్ కూడా ఆదరించటం చుస్తే ఈ సినిమా రేంజ్ అర్థమవుతుంది. ఎన్టీఆర్ కెరీర్లో అది కూడా ఇమేజ్ ను మార్చిన సినిమాగా చెప్పచ్చు. రామ్ చరణ్ కెరీర్లో మగధీర సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ప్రభాస్ కెరీర్లో ఛత్రపతి సినిమా ఇమేజ్ మార్చిన సినిమాగా నిలుస్తుంది  రవితేజ సినిమా ఇడియట్ కూడా ఈ కోవకే చెందుతుంది, ఇడియట్ సినిమా తర్వాత వరుస హిట్స్ తో స్టార్ హీరోలకు పోటీగా నిలిచే స్థాయికి ఎదిగాడు అప్పట్లో.అయితే ఇటీవలి కాలంలో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాలు రావటం లేదు. హీరోలు తమ ఇమేజ్ ను పక్కన పెట్టి నటించటానికి అంతగా ఆసక్తి చూపకపోవటం ఒక కారణం అయితే, బిజినెస్ ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు రిస్క్ చేయటానికి సాహసించక పోవటం మరొక కారణంగా చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు