Tollywood: హీరోలు మాత్రమే కాదు మహా ముదుర్లు..!

ఒకప్పుడు హీరోలంటే నటనకు మాత్రమే పరిమితం అయ్యేవారు, ఏ ఒకరో ఇద్దరో డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ లాంటి పనులు కూడా చేసేవారు. కానీ ఇప్పటి జనరేషన్ నటుల్లో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీలు ఎక్కువ మందే ఉన్నారు. అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి వంటి వారు ఒక పక్క హీరోలుగా నటిస్తూనే డైరెక్షన్, రైటింగ్ సైడ్ కూడా టాలెంట్ చూపిస్తూ వస్తున్నారు. 2009లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధూ జొన్నలగడ్డ చిన్న చిన్న పత్రాలు LBW సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు తెలుగు తమిళ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు సాధించలేకపోయాడు.

ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో వచ్చిన గుంటూర్ టాకీస్ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సిద్దు ఆ సినిమాలో లీడ్ రోల్ చేయటమే కాకుండా ఆ సినిమాకు స్టోరీ, డైలాగ్స్ తో పాటు ఒక పాట కూడా పాడి అలరించాడు. ఆ తర్వాత కృష్ణ వెడ్స్ లీలా, డీజే టిల్లు వంటి సినిమాలకు రైటర్ గా ఎడిటర్ గా వర్క్ చేశారు. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ కి కూడా రైటర్ గా వర్క్ చేస్తున్నాడు. మరో హీరో నవీన్ పోలిశెట్టి కూడా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాకు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే పరంగా ఇన్వాల్వ్ అయ్యాడు. అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కర్మ, కిస్, గూఢచారి క్షణం, మేజర్ వంటి సినిమాల్లో నటించటమే కాకుండా రైటర్ గా డైరెక్టర్ గా కూడా పని చేసాడు.

మరో హీరో విశ్వక్ సేన్ కూడా ఫలక్నామదాస్, దాస్ కా ధమ్కీ సినిమాలకు రైటర్ గా,డైరెక్టర్ గా,ప్రొడ్యూసర్ గా పని చేసి తన సత్తా చాటాడు. కేవలం నటనలోనే కాకుండా ఇతర క్రాఫ్ట్స్ లో కూడా ప్రావిణ్యం ఉన్న ఈ యువ హీరోలను నిర్మాతలు, డైరెక్టర్లు సరైన రీతిలో వాడుకుంటే గనక టాలీవుడ్ మరిన్ని కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు