#SSMB28: త్రివిక్రమ్ కి అలా కలిసొచ్చిందా..?

ఒక్కోసారి మనం అనుకున్న పనులు జరగకపోవటం, ఆలస్యం అవ్వటం లాంటివి కూడా మనకు మేలు చేస్తుంటాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఇందుకు ఉదాహరణగా  చెప్పవచ్చు. విషయం ఏంటంటే,రాజమౌళి సెంటిమెంట్ ఎఫెక్ట్ బారిన పడకుండా త్రివిక్రమ్ ఒకసారి కాదు రెండుసార్లు తప్పించుకున్నారు. ఎలాగంటే, గతంలో రామ్ చరణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్లో సినిమా ఉండనుంది అన్న వార్తలు వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కాలేదు. ఒకవేళ ఫైనలైజ్ అయ్యుంటే RRR తర్వాత ఆచార్య సినిమాకు బదులు రామ్ చరణ్ త్రివిక్రమ్ సినిమాలో నటించి ఉండేవాడు, రాజమౌళి ఎఫెక్ట్ తో ఆ సినిమా కాస్తా ఫ్లాప్ అయ్యేది.

అంతే కాకుండా RRR తర్వాత ఎన్టీఆర్ తో కూడా త్రివిక్రమ్ సినిమా ఉండనుందంటూ వార్తలొచ్చాయి కానీ, ఈ కాంబినేషన్ కూడా కార్యరూపం దాల్చలేదు. ఆ రకంగా రెండోసారి రాజమౌళి సెంటిమెంట్ వల్ల లాస్ అవకుండా త్రివిక్రమ్ బయట పడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రామ్ చరణ్ రూపంలో ఆచార్య సినిమా ద్వారా డైరెక్టర్ కొరటాలను రాజమౌళి సెంటిమెంట్ వెంటాడితే, ఇప్పుడు ఎన్టీఆర్ తో కొరటాల చేసే సినిమాకు కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందా అన్న అనుమానం కలుగుతుంది. అల వైకుంఠపురం సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేసే పనిలో పడ్డారు.

2024 సంక్రాతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్లో సిగరెట్  తో మాస్ లుక్ లో కనిపిస్తున్న మహేష్ బాబుని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. త్రివిక్రమ్ మహేష్ ల కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు