Shaakuntalam: దిల్ రాజు హ్యాట్రిక్ కొడతాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ తరం నిర్మాతల్లో అధిక సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల లిస్ట్ లో దిల్ రాజు ముందుంటాడు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తనకున్న జడ్జిమెంట్ స్కిల్స్ మరియు సినిమా పట్ల మంచి టేస్ట్ తో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల విడుదలైన  బలగం సినిమా అనూహ్య రీతిలో బ్లాక్ బస్టర్ అవ్వటంతో జోష్ లో ఉన్నాడు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు సహా నిర్మాతగా వ్యవహరించిన శాకుంతలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ లేడి ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిన ఈ సినిమా ప్రీమియర్స్ లో డీసెంట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ అందుకుంటుంది.

గుణశేఖర్ ఈ సినిమా కథ రాసుకున్న సమయంలో 40కోట్ల ఎస్టిమేటెడ్ బడ్జెట్ అనుకోని సినిమా మొదలు పెట్టారట. అయితే ఈ కథ నచ్చి దిల్ రాజు సహనిర్మాతగా చేరటంతో బడ్జెట్ కాస్తా 54కోట్లకు పెరిగిందట. విజువల్ వండర్ గా చూపించాల్సిన ఈ సినిమాను 3డీలో కూడా రూపొందించటం వల్ల 10కోట్ల అదనపు బడ్జెట్ పెరిగి మొత్తం 64కోట్ల మేర ఖర్చయ్యిందట. శాకుంతలం సినిమా మొత్తం ప్రీరిలీజ్ బిజినెస్ 40కోట్ల వరకు జరిగిందని టాక్. ఈ క్రమంలో నిర్మాత సేఫ్ జోన్ కి చేరుకోవాలంటే 24కోట్ల కలెక్షన్స్ కావాలి అంటే సినిమాకు థియేటర్ల నుండి 50కోట్ల గ్రాస్ రాబట్టాలన్నమాట.

తొలి ఆట నుండే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావటం అంత సులభం అయితే కాదని అనిపిస్తుంది. సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాకపోవడానికి ప్రధాన కారణం హీరో మోహన్ దేవ్ తెలుగు ఆడియెన్స్ కి పరిచయం లేకపోవటమే అని చెప్పాలి. హీరో సెంట్రిక్ మార్కెట్ ఉన్న ఇండస్ట్రీలో లేడి ఓరియెంటెడ్ సినిమాలపై పెట్టుబడి పెట్టేందుకు బయ్యర్లు కూడా ముందుకు రారు. ఇదే సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోవటానికి కారణం. మరి, వరుస హిట్స్ తో ఊపు మీదున్న దిల్ రాజుకి సినిమా హ్యాట్రిక్ ఇస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు