Rakul preet singh: దురదృష్టం అంటే ఈ హీరోయిన్ దే..!!

Rakulpreetsingh:  టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. దాదాపుగా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. గడిచిన రెండు మూడేళ్ల నుంచి ఏ ఒక్క సినిమాలో కూడా తెలుగులో నటించలేదు.. కేవలం బాలీవుడ్ వైపే ఎక్కువగా అడుగులు వేస్తూ అక్కడ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తోంది.. బాలీవుడ్లో ఎమ్మెస్ ధోని ది ఆన్ టోల్డ్ స్టోరీ ఎంత విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు..

ఈ సినిమాలో ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించగా.. ఇందులో కియారా అద్వానీ, దిశాపటాని వంటి వారు నటించారు.. వీరి కెరియర్ కూడా ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు.. బాలీవుడ్ తో సహా అన్ని పరిశ్రమలలో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా పేరు సంపాదించారు.. వాస్తవానికి ఈ అదృష్టం మొదట రకుల్ ప్రీతిసింగ్ ను వరించిందట. కానీ చివరి నిమిషంలో దురదృష్టవ శాత్తు ఈ సినిమాని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా చిత్ర బృందం అయితే ఈమెతో సంప్రదింపులు జరిపారట. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమాను కూడా వదులుకుంది.

ఇటీవలే రకుల్ ప్రీతిసింగ్ ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమ , దక్షణాది పరిశ్రమను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా మారిందని తెలిపింది. తన మొదటి చిత్రం దేదే ప్యార్ దే.. సినిమా చేయడానికి నాలుగేళ్ల ముందు ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ తో సహా ఇతర బాలీవుడ్ చిత్రాలు వచ్చాయని ఇందులో కొన్ని చిత్రాలను తిరస్కరించానని, అందులో ధోని బయోపిక్ సినిమా కూడా ఒకటి అని.. అందుకు కారణం సినీ పరిశ్రమలో కాల్ షీట్ల సమస్యలను అదిగమించకపోవడమే కారణం అన్నట్లుగా తెలియజేసింది.

- Advertisement -

మొదట ధోనీ అన్ టోల్డ్ సినిమా కోసం సంతకం చేశానని.. ఈ సినిమా చిత్రీకరణ 20 రోజులు కాస్త ఆలస్యం అయ్యిందని.. ఆ సమయంలో దక్షిణ భారత సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ఒకేసారి రెండు చిత్రాలతో కలిసి పని చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఎమ్మెస్ ధోని గ బయోపిక్ లో హీరోయిన్ గా పాత్ర వచ్చినా డేట్ లు అడ్జస్ట్ చేయలేక తిరస్కరించానని తెలిపింది. కానీ బాలీవుడ్ లో ఇప్పటికీ రకుల్ ప్రీతిసింగ్ స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది. కానీ టాలీవుడ్ లో మాత్రం మంచి హోదాని అందుకుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు