Guntur kaaram: గుంటూరు కారం సెకండ్ డే కలెక్షన్స్.. రికవరీ అయ్యారా..?

Guntur kaaram:  టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చిన మూడవ చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమా దాదాపుగా 13 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో విడుదల కావడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది గుంటూరు కారం సినిమా. ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది కానీ అభిమానులు మాత్రం ఫుల్ మీల్స్ ఈ సినిమాతో తమకు దక్కింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబుని ఇప్పటివరకు చూడని సరికొత్త యాంగిల్ లో త్రివిక్రమ్ చూపించారని చెప్పవచ్చు. పండుగ సీజన్ పూర్తి అయ్యేసరికి గుంటూరు కారం ఏ విధంగా నిలబడుతుంది అనే విషయం పై ఆధారపడి ఉంది. ఇప్పటికే కలెక్షన్స్ తో అయితే గుంటూరు కారం సినిమా దూసుకుపోతోంది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంటర్లలో రూ.94 కోట్లు రాబట్టగా.. గుంటూరు కారం సినిమా రెండవ రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది..

రెండవ రోజు గుంటూరు కారం సినిమా కలెక్షన్ విషయానికి వస్తే.. 33 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.. దీనితో మొత్తం మీద 127 కోట్ల రూపాయలకి చేరుకున్నట్లు హారిక అండ్ హాసిని బ్యానర్ వారు అధికారికంగా ఒక ట్విట్టర్ రూపంలో తెలియజేశారు.. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. 135 కోట్ల రూపాయలు కాగా ఇందులో 66 కోట్ల రూపాయలు రెండు రోజుల్లోనే కలెక్ట్ చేయడం తో దాదాపుగా 50% పైగా బిజినెస్ రికవరీ కూడా చేసినట్లు కనిపిస్తోంది.

- Advertisement -

అడ్వాన్స్ బుకింగ్ పరంగా చూస్తే రెండవ రోజు కంటే మూడవరోజు కాస్త ఎక్కువగానే గుంటూరు కారం సినిమా హవా ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో మూడవరోజు రూ .15 నుంచి రూ .20 కోట్లు రాబడితే నాలుగవ రోజు ఆటోమేటిక్ గా బాక్సాఫీస్ వద్ద మంచి ఊపు ఉంటుంది. కనుక ఎటు చూసినా ఈ సినిమా 72- 75% వరకు బిజినెస్ రికవరీ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందట.. మరి ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు