Double Ismart Shooting Update: పూరీ స్పీడ్ తగ్గింది… బుద్ధొచ్చిందా? జాగ్రత్త పడుతున్నాడా?

Double Ismart Shooting Update

“జగన్ గారు… మా ఆవిడ అస్తమాటు చెప్తుంది అండి. నువ్వు రెండు, మూడు సంవత్సరాల పాటు సినిమాలు చేయడం కాదు. జగన్ గారి దగ్గరికి వెళ్లి నేర్చుకో… ఆరు నెలల్లో సినిమా చేసినా ఇండస్ట్రీ హిట్ ఎలా కొట్టాలో ఆయన దగ్గరికి వెళ్లి నేర్చుకో.. అంటుంది. నేను నిజంగా అడుగుతున్నా.. ఒక రెండు రోజులు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయాలి. సీరియస్‌గా మనస్ఫూర్తిగా అడుగుతున్నా… ఒప్పుకుంటారా? నెక్ట్స్ సినిమాకి టూ డేస్ అసిస్టెంట్ గా వస్తాను”

ఈ మాటలు ఎక్కడో విన్నట్టు ఉంది కదా… ఇప్పుడు దర్శకధీరుడుగా ఓ వెలుగు వెలుగుతున్న SS రాజమౌళి చెప్పిన మాటలు ఇవి. బిజినెస్ మ్యాన్ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ గురించి, సినిమాలు చేసే పద్దతి గురించి వివరిస్తూ ఈ మాటలు చెప్పాడు.

నిజానికి షార్ట్ టైంలో సినిమాను షూట్ చేసి, ఇండస్ట్రీ హిట్ కొట్టగలిగే సత్తా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ ఒక్కరికే ఉంది. ఈ విషయంలో దర్శకధీరుడు జక్కన్నతో సహా ఎంతో మందికి పూరీనే ఇన్స్పరేషన్.

- Advertisement -

అయితే తక్కువ కాలంలో సినిమాలు చేయడం అనేది ఈ మధ్య కాలంలో పూరికి వర్కౌట్ కాలేదు. రోగ్, మహబూబా లాంటి సినిమాలు దారుణంగా బెడిసికొట్టాయి. షార్ట్ టైంలో చేసిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ మినహా ఏది కూడా వర్కౌట్ కాలేదు. లైగర్ షూట్‌కి కూడా పూరి ఎక్కువ టైం తీసుకోలేదు. కరోనా వల్ల ఎక్కువ టైం పట్టింది. కానీ, షూటింగ్‌కి పూరీ ఎక్కువ రోజులు కేటాయించలేదు.

అయితే ఇప్పుడు ఈ షార్ట్ టైంలో సినిమాను చేయడం అనే తన పాలసీని పక్కన పెట్టాడు. తన నెక్ట్స్ సినిమా డబుల్ ఇస్మార్ట్ ను పక్కాగా, టైం తీసుకుని మరీ షూట్ చేస్తున్నాడు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే పూరీ రిలీజ్ డేట్ నెక్ట్స్ ఇయర్ మార్చి 8న అని ప్రకటించాడు. అంటే డబుల్ ఇస్మార్ట్ విషయంలో తొందర పనికి రాదని ముందే ఫిక్స్ అయ్యాడు పూరీ.

ప్రస్తుతం షూటింగ్ కూడా గతంలో కాకుండా, చాలా ఓపికగా.. చేస్తున్నాడట. ప్రతీ షాట్ రివ్యూ చేస్తూ అనుకున్న అవుట్ పుట్ వచ్చిన తర్వాతే.. నెక్ట్స్ షాట్ కి వెళ్తున్నాడని తెలుస్తోంది. దీంతో పూరీ జగన్నాథ్ కి బుద్ధొచ్చిందని కొంత మంది అంటున్నారు. మరి కొందరు లైగర్ లాంటి డిజాస్టార్ మరొకటి రావొద్దని జాగ్రత్తగా డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాతో పూరీ పవర్ ఫుల్ కం బ్యాక్ ఇవ్వాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు