Dil Raju: కథే బలం(గం)

డిస్టిబ్యూటర్ గా కెరియర్ మొదలు పెట్టిన వెంకటరమణ రెడ్డి. దిల్ సినిమాతో నిర్మాత దిల్ రాజు గా మారారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి ఎంతోమంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు దిల్ రాజు. సినీ పరిశ్రమలో డబ్బు రావడం, డబ్బు పోవడం, సక్సెస్, ఫెయిల్యూర్ కామన్ థింగ్ ఇక్కడ నిలబడటమే ఇంపార్టెంట్ అని క్లారిటీ ఉన్న నిర్మాత దిల్ రాజు.

దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి ఒక సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు తరలి వస్తారు. అలానే యూత్ ను ఆకట్టుకున్న లవ్ స్టోరీస్ ఈ బ్యానర్ లో చాలా వచ్చాయి. దిల్ రాజు నిర్మించిన చిత్రాలలో కొన్ని సినిమాలు మాత్రమే ఊహించిన స్థాయిలో ఆడలేదు తప్ప భారీ డిజాస్టర్ లు అయితే కాలేదు. ఒక ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, బృందావనం , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు దిల్ రాజు.

కొంతమంది దర్శకులు, హీరోస్ లా కాంబినేషన్ ను నమ్ముకోకుండా కేవలం కథను నమ్మి, సినిమాను నిర్మించడం దిల్ రాజు స్వభావం. ఒక కథను విని ఈ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో చెప్పగలగడం కేవలం దిల్ రాజుకే చెల్లిందని చెప్పొచ్చు. ఒక మంచి కథ వింటే దానిని డెవలప్ చేసే టీం ను కూడా ఆ దర్శకుడికి అందిస్తుంటారు దిల్ రాజు. బొమ్మరిల్లు లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు రావడం కూడా ఇలాంటి సమిష్ట కృషే అని చెప్పొచ్చు. ప్రేక్షకులకు ఒక మంచి సినిమాను ఇవ్వాలని దిల్ రాజు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు.

- Advertisement -

“సినిమాని ప్రేమించి, మంచి కంటెంట్ తో సినిమాలు తీసేవాళ్ళ కోసం నేను ఏది చెయ్యడానికి అయినా రెడీ” అని అంటుంటారు దిల్ రాజు. ఒక కమెడియన్ రాసుకున్న “బలగం” కథను నమ్మి సినిమా చేయడం మాములు విషయం కాదు. కేవలం కథలను దానిలోని విషయాన్ని నమ్మడం వలనే అప్పుడు ఒక ఆర్య, బొమ్మరిల్లు సినిమాలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఒక “బలగం” వచ్చింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు