Kabzaa: సినిమాపై నెగటివ్ టాక్ రావడానికి కారణాలు!

కేజిఎఫ్, కాంతారల తర్వాత కన్నడ నుంచి వస్తున్న పెద్ద సినిమాలు దేశంలోని అన్ని భాషల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక రియల్ స్టార్ ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదు. ఉపేంద్ర తాజాగా నటించిన కన్నడ పాన్ ఇండియా చిత్రం కబ్జా. సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ, మురళీ శర్మ లాంటి టాప్ స్టార్ కాస్ట్ తో వచ్చిన ఈ సినిమాపై కనడంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నిన్న రిలీజ్ కాగా యావరేజ్ టాక్ వచ్చింది. మరి ఈ సినిమాపై నెగటివ్ రావడానికి కారణాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.

కేజిఎఫ్ లో జర్నలిస్టు తాత, రాఖీ బాయ్ స్టోరీ చెబుతుంటే మనకు ప్రతి సీన్ లో గూస్ బంప్ వస్తుంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి చోటా కనెక్ట్ అవుతాం. అది ఏ చోట ఈ సినిమాలో కనిపించదు. కమిషనర్ భార్గవ్ బక్షి, డాన్ ఆర్కేశ్వర్ గురించి ఎలివేషన్స్ ఇచ్చి మరి చెబుతుంటారు. కానీ ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో ఎప్పుడు వస్తుందో అసలు అర్థం కాదు. దానికి తోడు విలన్ పాత్రలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ పేర్లు మరింత కన్ఫ్యూజ్ చేసేస్తాయి. అవి గుర్తుంచుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుంది.

పోనీ స్టోరీ బాగుందా అంటే నీరసంగా చప్పగా సాగుతూ ఉంటుంది. ఏ పాయింట్ లోనూ అసలు ఇంట్రెస్టే క్రియేట్ చేయదు. కేజీఎఫ్ స్టైల్ లో సినిమా తీయాలనుకోవడంలో తప్పులేదు. కానీ స్టోరీలో డెప్త్ తో పాటు ఎమోషన్స్ కూడా బలంగా ఉంటే ప్రేక్షకులు కేజీఎఫ్ ని మించి ఆదరిస్తారు. చెప్పాలంటే ఆ సినిమాను ఈజీగా మర్చిపోతారు. కబ్జా టీం ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది. స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు ఒక్కచోట కూడా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయలేక పోయింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు