Adhipurush : ఊరికే అయిపోరు పాన్ ఇండియా స్టార్ ! ప్రభాస్ అంటే మినిమమ్ ఉంటది

ప్రభాస్ ఒకప్పుడంటే టాలీవుడ్ కి మాత్రమే హీరో, కానీ ఇప్పడు ప్రభాస్ స్థాయి వేరు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సినిమాకి ఐకాన్ లాగా మారాడు.

ఛత్రపతి సినిమాలో యాక్టర్ జీవ ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ లో ప్రభాస్ గురించి చెబుతూ వాడి బాడీ బాక్స్ ఆఫీస్ రా అంటాడు. ఈ డైలాగ్ ని ఎం రత్నం ఏ క్షణంలో రాశాడో గాని ప్రస్తుతం అదే నిజం అవుతుంది.

ప్రభాస్ వల్ల ఇండియన్ సినిమా రేంజ్ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. గతంలో సినిమా కాస్త బడ్జెట్ ఎక్కువ పెట్టిన, ఆమ్మో అంత బడ్జెట్ పెట్టారా , ఇంత పెట్టారా, పెడితే పెట్టారు గాని ఆ సినిమా అంత రికవరీ చేస్తుందా అని మాట్లాడుకునేవాళ్ళ నోటికి తాళం పడింది. ఎంత బడ్జెట్ పెట్టిన రికవరీ చేయడానికి ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో ప్రస్తుతం తెలుగు పరిశ్రమలోనే ఉన్నాడు అనే టాలీవుడ్ గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాడు.

- Advertisement -

ప్రస్తుతం ప్రభాస్ అన్నీ హై బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. ఒక్కో సినిమాకి గాను దాదాపు 100cr నుంచి 150cr వరకు తీసుకుంటున్నడని టాక్. ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పటికీ ప్రభాస్ కి డబ్బు మీద వ్యామోహం లేదనే చెప్పాలి. తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తన చుట్టూ ఉన్న వాళ్ళకి లేదా, అభిమానులకి ఇస్తూ తన దయ గుణాన్ని ఎప్పటికప్పుడు చాటు కుంటూనే ఉన్నాడు. ఇటీవలనే ఆయన పెద్ద నాన్న కృష్ణం రాజు చనిపోతే అక్కడికి వచ్చిన అందరికి అన్ని రకాల నాన్ వెజ్ భోజనాలు ఏర్పాటు చేసి అభిమానుల పట్ల తన ప్రేమని తెలియజేసాడు.

అలాగే ప్రభాస్ ఇటీవలనే తాను ప్రస్తుతం చేస్తున్న సలార్ సినిమాకి పని చేసిన అందరు టెక్నిషియన్స్ కి ఒక్కొక్కరికి 10,000 వేల రూపాయలని వాళ్ళ బ్యాంక్ ఎకౌంట్ లలో డిపాజిట్ చేసాడంట. సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకోవడంతో ప్రభాస్ ఇంత కష్టపడిన వర్కర్స్ మరియు టెక్నిషియన్స్ కి  ఏదోఒకటి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా చేసాడంట. దాంతో హ్యాపీ గా ఫీల్ అయిన వర్కర్స్ అంత ప్రభాస్ నిజంగా మనసున్నోడు అంటూ ప్రభాస్ ని కొనియాడుతున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు