Music Sensation: చక్రి.. మాస్ మ్యూజిక్ కి కేరాఫ్.

టాలీవుడ్ లో ఒక మాస్ హీరోకి ఊర మాస్ సాంగ్ పడాలంటే ఇప్పుడు థమన్, డిఎస్పీ లేకపోతే అనిరుధ్ అంటున్నారు. కానీ 15ఏళ్ళ కిందట ఫ్యాన్స్ అందరి నోటా వచ్చేది చక్రి. తమ హీరోకి మంచి సాంగ్స్ ఆల్బమ్ పడాలంటే ఆ సినిమాకి చక్రియే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలని కోరుకుంటారు అప్పటి అభిమానులు. ఒక ఇడియట్, ఒక దేశముదురు, ఒక నేనింతే ఇలా ఒకటేమిటి చక్రి మ్యూజిక్ అందించిన చాలా సినిమాల్లోని మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది.

అప్పట్లో పూరిజగన్నాథ్ సినిమాలకి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రి ఉండేవాడంటే అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క పూరీకే కాదు అలనాటి దర్శకుడు “వంశీ” కి కూడా చాలా కాలం మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసాడు. చక్రి ఇచ్చిన మ్యూజిక్ లో వచ్చిన “చూపుల్తో గుచ్చి చంపకే “, “గోల పెట్టినాదిరో”, నైరే నైరే సాంగ్, కృష్ణా నగరే మామా లాంటి పాటలకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈయన మ్యూజిక్ ఇచ్చిన పాటలంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి.

ఇక చక్రి అంటే మాస్ పాటలే కాదు, మనసును తాకే పాటల పల్లకిలో, తన సంగీత సెలయేరు పారేలాను చేయగలడని సత్యం, చక్రం, గోపి గోపిక గోదావరి లాంటి సినిమాల్తో చాటి చెప్పాడు. ఈ సినిమాలకి చక్రి సంగీతమనే కాదు అద్భుతమైన తన గాత్రాన్ని కూడా అందించాడు. సత్యంలో “ఓ మగువ నీతో స్నేహం కోసం” అంటూ వచ్చే పాట ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూ ఉంటుంది. ఈ పాటకు బెస్ట్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు చక్రి. ఇవేకాదు చక్రి మ్యూజిక్ అందించిన ప్రతి సినిమాలో ఒక పాట పాడడం జరిగింది.

- Advertisement -

స్వతహాగా మెగాస్టార్ చిరంజీవి అభిమాని అయినటువంటి చక్రి చిరంజీవి కోసం చేసిన ప్రైవేట్ ఆల్బమ్ “చల్లగాలి” ద్వారా సక్సెస్ అయ్యాడు. అది విన్న చిరు ఎంతో మెచ్చుకున్నారు. అలా ఈ పాపులర్ అయిన ఆల్బం వల్ల పూరిజగన్నాథ్ బాచి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. టాలీవుడ్ లో ఎవరి దగ్గరా పనిచేయకుండా మ్యూజిక్ డైరెక్టర్ అయిన అతి కొద్ది మంది సంగీత దర్శకుల్లో చక్రి ఒకరు. ఈయన సంగీత సారథ్యంలోనే శివమణి, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, దేవదాసు, సింహా, గోలీమార్ లాంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ వచ్చాయి.

అంతా సజావుగా కాలం గడుస్తున్న సమయంలో 2014 లో సడన్ గా గుండెపోటు రావడంతో అపోలో హాస్పిటల్లో కన్నుమూశారు. చివరగా ఆయన ఎర్రబస్సు సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ రోజు(జూన్15) చక్రి జయంతి. ఈ సందర్భంగా ఆయనకి filmify టీమ్ తరపున నివాళులర్పిస్తూ స్మరించుకుంటున్నాం. చక్రి ఎక్కడ ఉన్నా ఆయన పాటలు మాత్రం మనతోనే ఉంటాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు