Devara : కొరటాల శివ ఒక అరుదైన రకం

సినిమా ప్రపంచం ఎప్పుడు ఎవ్వరిని అందలం ఎక్కిస్తుందో, ఎప్పుడు ఎవ్వరిని పాతాళానికి తొక్కుతుందో ఎవరు చెప్పలేరు. అందరు సరదాకి చూసే ప్రతి శుక్రవారం రిలీజయ్యే సినిమాని నమ్ముకొని కొంత మంది జీవితాలే ఆధారపడి ఉంటాయి. అన్ని బాగుండి సినిమా హిట్టైందా తెల్లారేలోకల్లా జాతకం మారిపోతుంది, ఒకవేళ ఫ్లాప్ అయిందా అదే జాతకం తిరగబడిపోతుంది. ఇది అందరి ఫిలిం మేకర్స్ లో ఎప్పుడోకప్పుడు అనుభవించాల్సిన పిరియడ్. ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నాడు డైరెక్టర్ కొరటాల శివ.

రచయితగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కథ రచయితగా, డైలాగ్స్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. కానీ రచయితగా కొరటాల శివ పేరు బాగానే వచ్చిన మర్యాద, డబ్బు మాత్రం కొదువయ్యాయి. దాంతో తనలోని దర్శకుడిని బయటికి తీసుకు రావాలని ఉద్దేశ్యంతో ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాల శివ ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. మిర్చి సినిమా తరువాత మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాని తెరకెక్కించాడు కొరటాల, బాహుబలి సినిమా థియేటర్స్ లో సందడి చేస్తున్న ఆ సమయంలో రిలీజైన శ్రీమంతుడు సినిమా ఆ బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్స్ ని రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత ఈయన దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు కూడా బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ అయ్యాయి.

- Advertisement -

ఇక ఇండస్రిలో కొరటాల శివని కొట్టేవాడు లేడు అనుకునేంతలా మాట్లాడుకున్నారు ఆ తరువాత ఆయన చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య సినిమా ఘోర పరాజయం అందుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఒక్కసారిగా లెక్కలన్నీ మారిపోయాయి. అప్పటిదాకా కొరటాల శివ మాకు కావాలంటే, మాకు కావాలి అని పోటీ పడిన వాళ్లంతా ఆయనను దూరం పెట్టారు.

ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆచార్య సినిమా వల్ల తాను కోల్పోయిన పేరుని మళ్ళీ దేవర సినిమాతో తిరిగి పొందాలనే కసితో కొరటాల శివ ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఆయన ఆశించినట్టుగానే ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి తన స్టామిన ఏంటో మళ్ళీ ఇండస్ట్రీ చూపించాలని కోరుకుంటూ..

జన్మదిన శుభాకాంక్షలు కొరటాల శివ గారు !

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు