Prabhas Announcement: దీని కోసమే కదా వెయిట్ చేస్తుంది… నవంబర్ 6న ప్రభాస్ బిగ్ అనౌన్స్ మెంట్?

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రభాస్ నోటి నుంచి ఫ్యాన్స్ ఓ గుడ్ న్యూస్ వినబోతున్నారు. దీనికి మూహుర్తం నవంబర్ 6. అనౌన్స్ మెంట్ కి ఇప్పటికే అన్ని ప్రీపేర్ అయినట్టు తెలుస్తుంది. ఈ హాడావుడి దేనికి అని అనుకుంటున్నారా?? ప్రభాస్ పెళ్లి గురించి అయితే కాదు లేండి. ప్రభాస్ పెళ్లి గురించి అనౌన్స్ మెంట్ రావాలంటే.. ఇంకా ఎన్ని ఏళ్లు వెయిట్ చేయాలో ఎవరికీ తెలియదు. కనీసం ప్రభాస్ ఫ్యామిలీకి అయినా తెలుసో… తెలిదో.

అయితే నవంబర్ 6న ఏంటా అనౌన్స్ మెంట్ అనుకుంటున్నారా? ప్రభాస్ తర్వాత సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ మొన్నటి వరకు తన మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అందుకు ఇటీవల విదేశాల్లో ఆపరేషన్ కూడా చేసుకున్నాడట. దాదాపు రెండు నెలల గ్యాప్ తర్వాత ప్రభాస్ ఇండియాకు తిరిగిరాబోతున్నారని టాక్. వచ్చిన వెంటనే ప్రభాస్ తన తర్వాత సినిమా గురించి అనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ప్రభాస్ ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల షూటింగ్స్ ను దాదాపు పూర్తి చేసుకున్నాడు. సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ ఇంకా చర్చల దశలోనే ఉంది.

- Advertisement -

అయితే ప్రభాస్ బర్త్ డే రోజు ఈ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనికి కారణం ప్రభాసేనట. తాను ప్రజెంట్ హైదరాబాద్ లో లేను కదా, తిరిగి వచ్చిన తర్వాత అన్ని సినిమాల అప్డేట్స్ ఇద్దామని అన్నారు. అలాగే తాను చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా అప్పుడే ఇద్దమని చెప్పారట. దీంతో నవంబర్ 6న ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు