Trisha Comments: రజినీకాంత్‌ను రిజెక్ట్ చేయడానికి రీజన్ చెప్పిన త్రిష

సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరని అడిగితే ఎవరికైనా మొదట గుర్తుకువచ్చే పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. దానగుణంలోనూ, మంచితనంలోనూ ఆయనకు ఎవరు వంక పెట్టలేరు. తమిళ ఇండస్ట్రీ ముద్దుబిడ్డ ఎవరంటే రజినీకాంత్ అని చెప్పుకోవాలి. ఓ సాధారణ బస్సు కండక్టర్ గా కెరీర్ ని కొనసాగిస్తున్న రజినీకాంత్ కి అనుకోకుండా సినిమాలలో అవకాశాలు రావడం, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని సక్సెస్ లు అందుకుంటూ సూపర్ స్టార్ గా ఎదగడం మనమంతా చూస్తూనే ఉన్నాం.

జీవితంలో పైకి రావాలి అని కోరుకునే ప్రతి మనిషికి కూడా రజనీకాంత్ ఓ ఆదర్శం. అందుకే ఆయనను ఇష్టపడని వారంటూ ఉండరు. అలాంటి రజినీకాంత్ సినిమాలో చిన్నపాటి పాత్ర వచ్చినా చాలు జన్మ ధన్యం అనుకుంటారు చాలామంది. అలాంటి రజిని పక్కన ఏకంగా హీరోయిన్ అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..? కానీ ఓ నటి అంత పని చేసింది. ఆమె మరెవరో కాదు అందాల సుందరి త్రిష. కథానాయికగా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నప్పటికీ తరగని అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

చాలా కాలం గ్యాప్ తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి ఆకట్టుకుంది ఈ చిన్నది. అయితే ఈ ముద్దుగుమ్మ కి రజనీకాంత్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకుందట. అప్పట్లో రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో శ్రీయ హీరోయిన్ గా నటించింది.

- Advertisement -

అయితే ఈ చిత్రంలో ముందుగా త్రిషని అనుకోగా ఆమె మాత్రం సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. దీనికి కారణం ఆ సమయంలో ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే ఈ పాత్ర మీకు బాగా సెట్ అవుతుందని శంకర్ అడిగినప్పటికీ ఆమె కుదరదని చెప్పిందట. ఈ విషయం తెలిసిన నెటిజెన్లు త్రిష తన చేజేతులా ఓ మంచి అవకాశాన్ని వదులుకుందని కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు