Aarthi Agarwal: తన కొడుకును పెళ్లి చేసుకోమని ఆర్తి అగర్వాల్ ని వేడుకున్న స్టార్ హీరో..!

తెలుగు తెరమీద తారాజువ్వలా దూసుకొచ్చిన యువతారల్లో ఆర్తి అగర్వాల్ ఒకరు. నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాతో 16 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ వెండితెరపై సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన ఆర్తి అగర్వాల్.. ప్రభాస్, చిరంజీవి, తరుణ్, నాగార్జున, మహేష్ బాబు, బాలకృష్ణ, రవితేజ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
చిన్న వయసులోనే స్టార్ డం అందుకొని టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి ప్రేమ విఫలం కావడం, వైద్య చికిత్స వికటించడంతో 2015లో గుండెపోటుతో మరణించింది. ఆమె మరణానికి సంబంధించి ఇప్పటికీ పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఆర్తి అగర్వాల్ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఓ స్టార్ హీరో తండ్రి ఓ ప్రపోజల్ ద్వారా ఆమె ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
అదేంటంటే.. ఆ స్టార్ హీరో కి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, ఎంత హోదా ఉన్నా అవన్నీ పక్కనపెట్టి ఆర్తి అగర్వాల్ వద్దకు వచ్చి తన కుమారుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని, పెళ్లి చేసుకోమనే ప్రపోజల్ తీసుకువచ్చారట. అయితే ఈ ప్రపోజల్ ని ఆర్తి అగర్వాల్ రిజెక్ట్ చేశారని సమాచారం. అయితే ఆమె అప్పటికే తరుణ్ తో ప్రేమలో ఉందని, అందుకే ఆ స్టార్ హీరో కుమారుడిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకొని ఆ తర్వాత బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుని అది వికటించి మరణించింది.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు