Ponniyin Selvan : ఫస్ట్ సింగిల్ అప్ డేట్

అగ్ర దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తో పాటు జయం రవి, కార్తీ నటిస్తున్నారు. అలాగే మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో పాటు త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లుకు భారీ స్పందన వచ్చింది. సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి.

ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజా గా మూవీ యూనిట్ ఫస్ట్ సింగిల్ పై ఒక అప్ డేట్ ఇచ్చింది. ఫస్ట్ సింగిల్ త్వరలోనే అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఎ.ఆర్ రెహమాన్, శివమణి, డైరెక్టర్ మణిరత్నంతో పాటు పొన్నియిన్ సెల్వన్ టీం సభ్యులు ఉన్నారు. ఈ వీడియోలో శివమణి డ్రమ్స్ వాయిస్తూ కనిపించాడు. దుమ్ములేపే సౌండ్స్ తో ఈ వీడియో ఉంది. ఫస్ట్ సింగిల్ కోసమే వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వీడియోలో వచ్చే మ్యూజిక్ తో ఫస్ట్ సింగిల్ పై అంచనాలు భారీగానే పెరిగాయి. కాగ, ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు