Pawan Kalyan: కొత్తైనా పాతైనా రికార్డ్ తనకే సొంతం

టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ శరవేగంగా దూసుకెళ్తుంది. ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలతో పోటీ పడుతూ థియేటర్స్ ను బుక్ చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్. కలెక్షన్స్ పరంగా కూడా మేకర్స్ కు మంచి లాభాలను తెచ్చి పెడుతున్నాయి రీ రిలీజ్ సినిమాలు. రీరిలీజ్ అవుతున్న సినిమాల డేట్స్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త సినిమాలను రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. వాటి ఎఫెక్ట్ కొత్త సినిమాల పై పడకుండా ప్రొడ్యూసర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ధమాకా మరియు 18 పేజెస్ సినిమాలు మెల్లగా కలెక్షన్స్ పరంగా పుంజుకుంటున్నాయి. అయితే ఖుషి రిలీజ్ వీటి పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అన్న సందేహాలు ఎన్నో ఉన్నాయ్. మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా ఒక్కడు, పోకిరి సినిమాలను రీ రిలీజ్ చేసారు సూపర్ స్టార్ అభిమానులు ఈ సినిమాలకు బ్రహ్మరధం పట్టారు. ఇదే తరహాలో రిలీజైన తమ్ముడు జల్సా సినిమాలతో పవన్ అభిమానులు ఈ రీ రిలీజ్ ట్రెండ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లారు.

ఇలాంటి తరుణంలో రీరిలీజ్ అవుతున్న సినిమాలు అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు బద్దలుకొడుతున్నాయి. జల్సా సినిమా ప్రీ బుకింగ్స్ లో 75.1లక్షలు అగ్ర స్థానంలో ఉండగా ఇంకా రిలీజ్ కూడా అవని ఖుషి మాత్రం 36 లక్షలతో రెండో స్థానంలో ఉంది. మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పోకిరి అడ్వాన్స్ బుకింగ్స్ లో 35 లక్షలతో మూడో స్థానంలో నిలిచింది. ప్రభాస్ బర్త్ డే కానుకగా రీరిలీజ్ అయిన బిల్లా 25 లక్షలు సంపాదించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు 21 లక్షలను మేకర్స్ కు తెచ్చి పెట్టింది.

- Advertisement -

కొత్త సినిమాల కలక్షన్స్ విషయంలో మాత్రమే కాకుండా ఇలా రీ రిలీజ్ సినిమాలు తో రికార్డ్ సృష్టించడం పవన్ కళ్యాణ్ కే చెల్లిందని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు