Raviteja : వీరయ్య తర్వాతే రావణాసుర

మాస్ మహారాజ రవి తేజ ఈ మధ్య వరుస సినిమాలతో చాల బిజీగా ఉన్నారు. ఇటీవల రవితేజ ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ధమాకా ఈ నెల 23న విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. దీనిలో రవితేజకు జోడీగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లకు రవితేజ ఎక్కువగా డేట్స్ ఇచ్చాడు. ఇంటర్వ్యూలు, పలు ప్రత్యేక కార్యక్రామలకు కూడా ఈ మాస్ మహారాజా వెళ్లాడు.

ధమాకా రిలీజ్ తర్వాత రవితేజ తన ఫోకస్ ను వాల్తేరు వీరయ్యపై పెట్టాడు. ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య ప్రమోషన్లకు కూడా రవితేజ టైం కేటాయిస్తున్నాడు. మంగళవారం జరిగిన మూవీ టీం ప్రెస్ మీట్ కు ఈ మాస్ హీరో హాజరయ్యాడు. ఈ హాడావుడిలో పడి రవితేజ తన రావణాసుర కి ఎక్కువ టైం ఇవ్వలేక పోతున్నాడు.

దీంతో రావణాసుర సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. నిజానికి ఈ చిత్రం ప్రమోషన్లను జరుపుకోవాల్సింది. కానీ రవితేజ బ్యాక్ టూ బ్యాక్ బిజీ షెడ్యూలో ఉండటంతో అది సాధ్యం కాలేక పోయింది. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక వార్త వినిపిస్తుంది. రావణాసురలో రవితేజ పాత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయిందని సమాచారం. కొన్ని పాటలకు సంబంధించిన షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది.

- Advertisement -

వాల్తేరు వీరయ్య విడుదల తర్వాత ఈ బ్యాలెన్స్ షూట్ ను పూర్తి చేసి ప్రమోషన్లకు వెళ్లనున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా రావణాసుర సినిమాను 2023 వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు