Pawan kalyan: “బ్రో” సినిమాకోసం భారీ సెట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పర్సనాలిటీ వెండితెరపై కనిపిస్తే చాలు, ఆడియన్స్ బాడీ లో కరెంట్ పాస్ అవుతుంది. థియేటర్ బ్యానర్స్ తో నిండిపోతాయి. పవర్ స్టార్ బొమ్మ పడితే థియేటర్ లో కాగితాల సునామి మొదలవుతుంది.అరుపులు ఆకాశాన్ని అంటుతాయి,కలక్షన్స్ కొత్త దారులు వెతుకుతాయి. రీమేక్ సినిమాతో కూడా రికార్డ్స్ కొట్టగల స్టామినా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అందరికి సాధ్యం కాదిది. ఒక సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేసారు అంటే అది పవన్ కళ్యాణ్ సినిమా అయ్యుండాలి.

పవన్ కెరియర్ జానీ సినిమా తర్వాత, పదేళ్లు సరైన హిట్ లేదు. అయినా ఇమేజ్ చెక్కు చెదరలేదు. రెండేళ్లకు ఒక సినిమా అయినా ఓపెనింగ్స్ కు డోకా లేదు. ఆయన సినిమా వస్తే చాలు దానికి హిట్టు ప్లాప్ తో సంబంధం లేదు.అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే.

వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో “ఓజి” తో పాటు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ సముద్రఖని దర్శకత్వంలో చేస్తున్న సినిమా “బ్రో”. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన “వినోదయసీతం” సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ” బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ మరియు సహనిర్మాత వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.

- Advertisement -

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే & డైలాగ్స్ ను అందిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి చక్కెర్లు కొడుతుంది. ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ సెవెన్ ఎకర్స్ లో నిర్మించినట్లు తెలుస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో మునిపెన్నడు లేని విధంగా ఈ భారీ సెట్ ఉండబోతుందని, దీని కోసం భారీ స్థాయిలో ఖర్చుపెట్టి ఈ సెట్ ను నిర్మించినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఏకంగా 28 రోజులు కాల్ షీట్లను కేటాయించినట్లు కేటాయించారట, అంతేకాకుండా ఈ సినిమా కోసం దాదాపు రోజుకు 18 గంటల పాటు సాయిధరమ్ తేజ్ కష్టపడుతున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం. ఈ సినిమాను విడుదల డేట్ ను ఇదివరకే ప్రకటించడం జరిగింది. ప్రకటించిన డేట్ కు ఈ సినిమా రిలీజ్ చేయాలి అంటే ఈ సినిమాని వేగంగా పూర్తి చేయాలి.

భీమ్లా నాయక్ తర్వాత పవన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన “బ్రో” ఫస్ట్ లుక్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక విధంగా ఆ ఫస్ట్ లుక్ వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తూ అభిమానులకు సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది అని చెప్పొచ్చు. “బ్రో” అనే టైటిల్ పెడుతున్నారు అని తెలిసినప్పుడు రకరకాల వార్తలు వినిపించాయి. కానీ మోషన్ పోస్టర్లు “బ్రో” అనే పదానికి ఇచ్చిన శ్లోకం లోని నిర్వచనాలు సినిమా టైటిల్ కు కరెక్ట్ గా సరిపడ్డాయి అనిపించాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జులైలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు