పైడిపల్లి.. పెద్ద ప్లానే ఇది

ఇళయదళపతి విజయ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో మంచి మార్కెట్ ఉన్న హీరో. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ లో మరో పవర్ స్టార్ రేంజ్ ఉన్న హీరో. అతని సినిమా రిలీజ్ అయితే భీభత్సమైన హడావిడి ఉంటుంది.శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన
విజయ్, తుపాకీ,అదిరింది,విజిల్ సినిమాలతో హిట్ లు కొట్టాడు,

ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకు మన తెలుగులో మంచి మార్కెట్ ఉండేది, ర‌జినీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విక్ర‌మ్, సూర్య‌, కార్తి.. ఇలా చాలామంది కోలీవుడ్ స్టార్ల సినిమాలకి తెలుగులో మంచి ఆదరణ లభించేది.కానీ ఈ మద్యకాలంలో అది బాగా తగ్గింది అని చెప్పొచ్చు.ఇప్పుడు విజయ్ సినిమాలకు తెలుగులో మంచి ఓపెనింగ్స్ రావడం మొదలయింది. విజయ్ నుంచి వస్తున్న సినిమాలకి బ్రహ్మరధం పడుతున్నారు తెలుగు ఆడియన్స్.

విజయ్ ప్రస్తుతం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమాను చేస్తున్నారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు, ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఈ సినిమాలో నటించే నటులను ఆఫీసియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. జయసుధ , ప్రకాష్ రాజ్ , ప్రభు , శరత్ కుమార్ లాంటి పెద్ద నటులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ కాస్టింగ్ చూస్తుంటే సినిమాని భారీగానే ప్లాన్ చేసాడు వంశీ అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు