ఈ వారం ఓటీటీలో…

సినీ లవర్స్.. ఓటీటీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సినవరం లేదు. థియేటర్స్ కు వెళ్లలేక పోయిన వారు.. ఓటీటీలకే మొగ్గు చూపుతారు. అందుకోసం ఒక్కొక్కరు కనీసం రెండు నుంచి మూడు ఓటీటీ ప్లాట్ ఫాంలను సబ్ స్క్రైబ్ చేసుకుంటున్నారు. దీంతో ప్రతి వారం ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి డిమాండ్ పెరుగుతంది.

ఈ వారం ఓటీటీలో రెండ పెద్ద సినిమాలతో పాటు.. చిన్న సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రీసెంట్ మూవీ బీస్ట్, బాలీవుడ్ సంచలనం ది కశ్మీర్ ఫైల్స్ కూడా ఈ వారంలోనే స్ట్రీమింగ్ కానున్నాయి.

విజయ్ బీస్ట్.. ఈ నెల 11న నెట్ ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ లలో రిలీజ్ కానుంది. అలాగే ది కశ్మీర్ ఫైల్స్ జీ 5 లో ఈ నెల 13 నుంచి స్ట్రిమింగ్ కాబోతుంది. అలాగే 13నే హోయ్ చోయ్ లో మహాభారత్ మర్డర్స్, స్నికెరెల్లా డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లో సీనియర్ ఇయర్ కూడా ప్రసారం కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు