‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ 25 రోజుల కలెక్షన్లు..!

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది. యష్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని.. డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ చేసిన మూవీగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ఈ మూవీ మాస్ సెంటర్స్ లో మంచి వసూళ్లను సాధిస్తుంది. ‘ఆచార్య’ వంటి పెద్ద స్టార్లు నటించిన సినిమా వచ్చినా.. గత వీకెండ్ కు కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయినా.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ డీసెంట్ వసూళ్లను రాబట్టింది.తెలుగు రాష్ట్రాల్లో రూ.75 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ 25 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం : 42.30 కోట్లు
సీడెడ్ : 11.68 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.75 కోట్లు
ఈస్ట్ : 5.53 కోట్లు
వెస్ట్ : 3.55 కోట్లు
కృష్ణా : 4.2 కోట్లు
గుంటూరు : 4.77 కోట్లు

మొత్తం.. నెల్లూరు : 2.78 కోట్లు

- Advertisement -

ఏపి + తెలంగాణ : 82.56 కోట్లు(షేర్)

ఇప్పటివరకు ఈ మూవీ రూ.7 కోట్ల పైగా ప్రాఫిట్స్ ను అందించి సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే ఆంధ్రా రీజన్లో ఈ మూవీ బయ్యర్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఈ మూవీకి రూ.50 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ 25 రోజులకి గాను అక్కడ ఈ మూవీ రూ.40.26 కోట్ల షేర్ ను మాత్రమే నమోదు చేసింది. టికెట్ రేట్ల హైక్ లు, బెనిఫిట్ షోలు వంటి ఎక్స్ట్రా బెనిఫిట్ లు ఉంటే.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి ఉండేదేమో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు