NTR30: హమ్మయ్య.. పూజా డేట్ మొత్తానికి అనౌన్స్ చేశారు

ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్  తన తర్వాతి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో జూనియర్ ఎన్టీఆర్ సందర్భంగా పుట్టిన రోజు గతేడాది మే 20న సినిమాపై అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల ఈ సినిమా లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని అనౌన్స్ చేశారు. జాన్వీ కపూర్ కు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి, ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ  జాన్వీ కపూర్ ఉండటంతో సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు పెరిగాయి.

కాగా,  ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబోలో రాబోతున్న రెండవ చిత్రం ఇది. వారి కాంబో లో వచ్చిన మొదటి సినిమా జనతా గ్యారేజ్, ఈ సినిమా మంచి హిట్ నే అందుకుంది. అందుకే వీరి కాంబో లో రాబోతున్న ఇంకో సినిమా కాబట్టి, ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులు వేచి చూస్తున్నారు.

ఈ సినిమా గురించి అనౌన్స్ చేసి చాలా నెలలు గడిచినప్పటికీ, కారణాల వాళ్ళ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది. అయితే ఈ సినిమా గురించి మనకి అందిన తాజా వార్త ఏంటంటే, ఈ సినిమా పూజా కార్యక్రమం ముహూర్తం మార్చి 23న జరగనుంది అని మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను మూవీ టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. మార్చి 23న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి, త్వరగానే సెట్స్ పైకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని డైరెక్టర్ కొరటాల చేస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు