Nagarjuna New Movie: నా సామి రంగ మాస్ జాతర లోడింగ్… నాగ్ బిగ్ ప్లాన్

అక్కినేని నాగార్జున 99వ సినిమా గురించి ఈ మధ్య కాలంలో చాలా చర్చ జరిగింది. ది ఘోస్ట్ రిజల్ట్ తర్వాత నాగ్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అందుకే 99వ సినిమాకి ఇంత ఆలస్యమవుతుంది అని చెప్పొచ్చు. కాగా, నాగ్ 99వ మూవీ ముందుగా బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఉండబోతుందని టాక్ వచ్చింది. కానీ, ఇప్పుడు విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోస్‌కి కొరియోగ్రఫ్ చేసిన విజయ్ బిన్నితో నాగ్ సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాను ఆగష్టు29న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ “నా సామి రంగ” అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారట. అంతే కాదు.. “మాస్ జాతర లోడింగ్” అనేది దీనికి ఉప శీర్షిక అని తెలుస్తుంది. అక్కినేని నాగేశ్వర రావు నటించిన “సిపాయి చిన్నోడు” అనే సినిమాలో “నా జన్మభూమి ఎంత అందమైన దేశము… నా ఇల్లు అందులోని కమ్మని ప్రదేశము… నా సామి రంగా” అనే ఒక పాట ఉంటుంది. ఈ పాటలోనే లిరిక్‌ని తీసుకుని మూవీకి టైటిల్ గా ఫిక్స్ చేశారని టాక్.

ఆగష్టు29న అక్కినేని అభిమానులకు నాగ్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. KING99 అనౌన్స్ మెంట్ మాత్రమే కాదు.. టైటిల్ రివీల్ చేయడంతో పాటు చిన్న పాటి గ్లింప్స్ ను కూడా విడుదల చేయబోతున్నారట. దీని కోసం ప్రత్యేకంగా రెండు రోజుల పాటు షూటింగ్ కూడా చేశారని సమాచారం. నాగ్ పుట్టిన రోజున విడుదల కాబోయే గ్లింప్స్‌‌లో ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఉంటుందట. అది నాగ్ ఇప్పటి వరకు ట్రై చేయలేని యాసతో ఉంటుందని, నాగ్ లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌ని హీరోయిన్‌గా తీసుకోబోతున్నారని టాక్.

- Advertisement -

గ్లింప్స్‌లో ఉండే డైలాగ్, నాగ్ లుక్‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతాయట. అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ డైలాగ్ ఏంటి? నాగ్ లుక్ ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే, ఆగష్టు 29 వరకు వెయిట్ చేయాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు