King Of kotha: టాక్ వచ్చుంటే రికార్డులు బద్దలు కొట్టేది?

King of kotha 1st day collections:

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా సినిమా కింగ్ అఫ్ కొత్త. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగష్టు24న రిలీజ్ అయింది. అయితే ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే రిలీజ్ కి ముందు భారీ ప్రమోషన్లతో చిత్ర యూనిట్ హడావిడి చేయడంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

కింగ్ అఫ్ కొత్త రిలీజ్ అయిన మొదటిరోజు కేరళలో 6.55 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ లో మాత్రం ఏకంగా 8.35కోట్లు వసూలు చేసింది. ఇక మలయాళం సినిమాల్లో ఓవర్సీస్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నంతలో పర్వాలేదనే ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపు అన్ని ఏరియాల్లో కలిపి కోటికి పైగా గ్రాస్ వచ్చింది. ఇక మిగతా ఏరియాలన్ని కలిపి మరో రెండు కోట్లు వచ్చాయి.

ఓవరాల్ గా కింగ్ అఫ్ కొత్త ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 17.36కోట్ల గ్రాస్ వసూలు చేయగా, 7. 85 కోట్ల షేర్ రాబట్టింది. అయితే కింగ్ అఫ్ కొత్త పై ఉన్న అంచనాలకి టాక్ బాగా వచ్చి ఉంటె మలయాళంలో అల్ టైం రికార్డు ఓపెనింగ్స్ వచ్చేవని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ వాల్యూ 40కోట్లకి పైగా ఉండగా , బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు మరో 32 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టాలి. ఇక వీకెండ్ సెలవుల ప్రభావంతో ఆదివారం ముగిసేసరికి మరో 15కోట్లు రావచ్చని అంచనా.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు