Mythri Movies : మైత్రి కి తప్పని తిప్పలు

తెలుగు ఇండస్ట్రీ లోనే అతి పెద్ద మరియు ప్రతిష్టాకమైన ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్. హీరో తో సంబంధం లేకుండా కథ బాగుంటే ప్రొడ్యూస్ చేస్తారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ సంస్థ భాద్యతలు వహిస్తున్నారు.. 2015లో స్థాపించబడ్డ మైత్రి మూవీ ప్రొడక్షన్స్ తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలను అందుకుంది. అమర్ అక్బర్ ఆంటోని సినిమా మినహా వీరు తీసినవన్ని దాదాపు హిట్ సినిమాలే. శ్రీమంతుడు నుంచి పుష్ప వారికి అని హిట్ సినిమాలే.

ప్రస్తుతం బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య,’ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మరియు విజయ్ దేవరకొండ ‘ఖుషి’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ మరియు చిరంజీవి సినిమాలు సంక్రాతి కానుకగా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. పుష్ప 2 షూటింగ్ దశలో ఉండగా, విజయ్ దేవరకొండ తో కలసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్న సమంత ఆరోగ్య సమస్యల వలన షూటింగ్ కి రావడం లేదు. ఈ ప్రొడక్షన్ హౌస్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ని కూడా లాంచ్ చేసింది.

ఈ తరుణంలో మైత్రి మూవీ ప్రొడక్షన్స్ లో IT దాడులు జరగడం కలకలం రేపుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసుల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో 15 లొకేషన్లలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు నిర్మాతలైన యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని మరియు చెరుకూరి మోహన్‌ల కార్యాలయాలు కూడా సోదాలు చేపడుతున్నారు.
తమ సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణంలో ఇలా జరగడం మైత్రిని చిక్కుల్లో నెట్టిసినట్లుంది. ఈ తిప్పలు మైత్రికి ఎప్పుడు తప్పుతాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు